లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Big Story

టి.సర్కార్ దీపావళి కానుక, ఆస్తిపన్నుపై 50 శాతం రాయితీ..

Published

on

Telangana Govt Diwali gift : తెలంగాణ సర్కార్ ప్రజలకు దీపావళి కానుక ప్రకటించింది. కరోనా కారణంగా..ఇప్పటికే అతలాకుతలమైన ప్రజల ఆర్థిక వ్యవస్థను బాగు చేసే విధంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మంత్రి కేటీఆర్, ఇతర మంత్రులు సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం తీసుకున్న నిర్ణయాలను 2020, నవంబర్ 14వ తేదీ శనివారం మీడియాకు వెల్లడించారు.కరోనా కాలంలో :-
కరోనా కాలంలో ప్రభుత్వ పరంగా చాలా కార్యక్రమాలు చేశామన్నారు. లాక్ డౌన్ సమయంలో రూ. 1500 చొప్పున నాలుగు నెలల పాటు ఇచ్చామన్నారు. కార్డు లేని వారికి బియ్యం ఇచ్చి పెద్ద ఎత్తున సహాయం చేశామన్నారు. కరోనా నియంత్రణలో రాష్ట్రం బేషుగ్గా పని చేస్తుందని కేంద్ర మంత్రి చెప్పారని గుర్తు చేశారు. ఆర్థిక పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉందని చాలా మంది మంత్రులు చెప్పారని తెలిపారు. ప్రజలకు ఏం చేస్తే బాగుంటుందనే దానిపై అడగడం జరిగిందన్నారు. దీనిపై సుదీర్ఘంగా చర్చించి..ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నామన్నారు.
ఆస్తి పన్ను విషయంలో :-

ఈ సంవత్సరం 2020-21 సంవత్సరానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పట్టణాల్లో ఆస్తి పన్ను విషయంలో ప్రజలకు కొంత రిలీఫ్ ఇవ్వాలని నిర్ణయించామన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 15 వేల రూపాయల లోపు (డొమెస్టిక్) కట్టే వారికి 50 శాతం రాయితీ, 140 పట్టణాల్లో (జీహెచ్ఎంసీ కాకుండా) రూ. 10 వేల లోపు కట్టే వారికి 50 శాతం రాయితీ ఇవ్వాలని నిర్ణయించామన్నారు.ఇంకా కేటీఆర్ ఏమన్నారంటే..
దీనివల్ల…‘GHMCలో 13 లక్షల 72 వేల కుటుంబాలకు లబ్ది చేకూరుతుంది. 196 కోట్ల 48 లక్షల రూపాయలు ప్రభుత్వంపై భారం పడుతుంది. ఇతర మున్సిపాల్టీల్లో 17 లక్షల 68 వేల కుటుంబాలకు లబ్ది జరుగుతుంది. 130 కోట్ల రిలీఫ్ లభిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షల 40 వేల కుటుంబాలకు లాభం జరుగుతుంది. రూ. 326 కోట్ల 48 లక్షల రిలీఫ్ చేకూరుతుందన్నారు. దీనివల్ల ప్రజలకు సంతోషం ఉంటుందని ఆశిస్తున్నామన్నారు. ఈ సంవత్సరం కట్టి ఉంటే..నెక్ట్స్ ఇయర్ లో అడ్జెస్ట్ చేస్తాం’ అన్నారు మంత్రి కేటీఆర్.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *