లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

కేసులు కొట్టేయాలని అడిగిన సర్పంచ్‌పై హైకోర్టు సీరియస్

Published

on

telangana-high-court

Telangana high court: తనపై కేసు కొట్టేయాలంటూ హైకోర్టుకు వెళ్లిన సర్పంచ్‌కు భలే చిక్కొచ్చిపడింది. తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసినందుకు కోర్టు సీరియస్ అయింది. ములుగు జిల్లా వెంకటాపురరం మండలంలోని లక్ష్మీదేవీపేటకు చెందిన సర్పంచ్ గట్టు కుమారస్వామి పిల్ దాఖలు చేశారు.

తామిచ్చిన వినతిపత్రాలపై యాక్షన్ తీసుకోవడంతో పాటు తమపై నమోదైన క్రిమినల్‌ కేసులను కొట్టివేయాలంటూ పిల్‌‌లో పేర్కొన్నారు. దాఖలు చేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎఫ్‌ఐఆర్‌ నమోదైనా… పిల్‌ దాఖలు చేసే ముందు ఈ అంశానికి సంబంధించి తమపై ఎలాంటి కేసులూ లేవని తప్పుడు అఫిడవిట్‌ ఎలా ఇస్తారని ప్రశ్నించింది.

ఇందులో వ్యక్తిగత ప్రయోజనం తప్ప ప్రజాప్రయోజనం ఏముందని ప్రశ్నించింది. తప్పుడు సమాచారం ఇవ్వడంతోపాటు కోర్టు సమయాన్ని వేస్ట్ చేసినందుకు రూ.50 వేల పెనాల్టీ చెల్లించాలని ఆర్డర్ వేసింది. రెండు వారాల్లోగా ఆ మొత్తాన్ని న్యాయసేవా సాధికార సంస్థ ముందు డిపాజిట్‌ చేసి రసీదు సమర్పించాలని ఆదేశించింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్‌ హిమా కోహ్లి, జస్టిస్‌ అభిషేక్‌రెడ్డితో కూడిన ధర్మాసనం సోమవారం తీర్పునిచ్చింది.

పిల్‌లో దాఖలు చేసిందేమంటే.. ‘గ్రామంలో ఉన్న గవర్నమెంట్ భూమిని ఎస్‌.మురళీధర్‌రావు అక్రమంగా ఆక్రమించుకున్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు కంప్లైంట్ చేసినా రెస్పాన్స్ లేదు. మురళీధర్‌రావు ఇచ్చిన కంప్లైంట్స్ ఆధారంగా తమపై పెట్టిన కేసులను కొట్టివేయాలి’ అని కోరుతూ కుమారస్వామి పిల్‌ను ధర్మాసనం ముందుపెట్టారు.

తీర్పును పునర్విచారించాలని కోరుతూ రివ్యూ పిటిషన్‌ దాఖలు చేస్తామని పిటిషనర్‌ తరపు న్యాయవాది సుజాత చెబుతున్నారు.