తెలంగాణ హోంమంత్రి కుటుంబానికి కరోనా..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీకి కరోనా రావడంతో రాష్ట్రంలో కలకలం మొదలైంది. హైదరాబాద్ ను చుట్టుముడుతున్న కరోనా నుంచి నగరవాసులను కాపాడేందుకు మరోసారి లాక్ డౌన్ అమలు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. హోం మంత్రితో పాటు కీలక నాయకులందరూ ఒక్కొక్కరూ కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటి వరకూ జీహెచ్ఎంసీ పరిధిలో 11వేల కేసులు నమోదయ్యాయి. ఇవే కాకుండా 7వేల యాక్టివ్ కేసులు ఉన్నాయి.

చాలా ప్రైవేట్ హాస్పిటళ్లలో చికిత్స్ తీసుకుంటున్న వారు ప్రభుత్వం లెక్కల్లో లేకపోవడంతో ఇంకొన్ని కేసులు ఉండొచ్చని.. భావిస్తున్నారు. వారం రోజుల్లో హైదరాబాద్ వ్యాప్తంగా 50వేల టెస్టులు చేయాలని భావించిన తెలంగాణ సక్సెస్ అయినట్లే కనిపిస్తుంది. హోం మంత్రి నివాసముంటున్న చార్మినార్ పరిధిలోనూ భారీ సంఖ్యలో కేసులు నమోదయ్యాయి.

సికింద్రాబాద్ జోన్ పరిధిలో 2242
ఖైరాతబాద్ జోన్ పరిధిలో 3631
చార్మినార్ జోన్ పరిధిలో 3274
ఎల్బీనర్ జోన్ పరిధిలో 732
కూకట్ పల్లి జోన్ పరిధిలో 498
శేరిలింగంపల్లి జోన్ పరిధిలో 720

లాక్ డౌన్ ఈ సమయంలో అమలు చేయడమే కీలకం అని చాలా వర్గాలు చెబుతున్నారు. ప్రభుత్వం చేయాలనుకుంటున్న టెస్టుల సంఖ్య పెంచాలని విశ్లేషకులు అంటున్నారు. టీఆర్ఎస్ అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు పాల్గొనడంతో కరోనా వైరస్ బారిన పడ్డారు. మహమూద్ అలీ నెల రోజులుగా ఎటువంటి కార్యక్రమాల్లో పాల్గొనలేదు.

ఆయన కుటుంబం మొత్తానికి పరీక్షలు నిర్వహించారు. హోం మంత్రి జూబ్లీ హిల్స్ హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. ఒకవేళ లాక్‌డౌన్ దిశగా వెళితే కచ్చితంగా 15రోజుల పాటు లాక్ డౌన్ విధించనున్నట్లు సమాచారం. ప్రైవేట్ హాస్పిటల్స్‌లో బెడ్ లు ఖాళీ లేకపోతుండటం సమస్యగా మారడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో రాష్ట్రం ఆర్థికంగా కూడా సమస్యలు మొదలుకానున్నాయి.