లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Crime News

జేబులో డబ్బులు తీసిందని భార్య కడుపులో పొడిచేసి..గదిలో పెట్టి బంధించి..

Published

on

Telangana husband attack on wife with knife : ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కడుపులో పొడిచేసి ఆమె ఏడుస్తుంటే ఏడుపు వినిపించిందంటే చంపేస్తాను అంటూ గదిలో పెట్టి బంధించేశాడు. దీనికి కారణం తన జేబులో డబ్బుల్ని భార్య తీసిందనే అనుమానం. కేవలం డబ్బులకోసమే భార్యను కత్తితో పొడిచాడా? అంటే అదొక సాకుతో కట్నం తీసుకురావాలనే సాధింపుల్లో భాగమని తేలింది.
ప్రేమ..పెళ్లి తరువాత కట్నం. ప్రేమించిన అమ్మాయిన ప్రేమగా చూసుకోకపోగా కట్నం కోసం వేధిస్తూ..జేబులో డబ్బులు తీసిందనే అనుమానంతో ఏకంగా కత్తితో భార్యను పొడిచేసి..గదిలో బంధించి ఆమె బాధతో విలవిల్లాడుతుంటూ పైశాచికానందం పొందిన భర్త ఘటన తెలంగాణాలోని కామారెడ్డి జిల్లాలో చోటచేసుకుంది.

వివరాల్లోకి వెడితే.. డిచ్‌పల్లి మండలం నడిపల్లి తండాకు చెందిన దివ్య అలియాస్‌ కవిత నాలుగేళ్ల క్రితం కామారెడ్డి జిల్లా బిచ్కుందకు చెందిన రాథోడ్‌ రాజును ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరిద్దరూ ఘన్‌పూర్‌లో ఓ అద్దె ఇంటిలో నివసిస్తున్నారు.రాథోడ్ రాజు పెయింటర్ గా పనిచేస్తున్నాడు. ఆ వచ్చిన డబ్బుతో బాగానే బతుకుతున్నారు. కానీ రాజులో డబ్బు ఆశ పెరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్నాను..నీ వల్ల ఒక్క పైసా కూడా లాభం లేదు..కాబట్టి పుట్టింటినుంచి కట్నంగా డబ్బు తేవాలని సాధింపులు మొదలు పెట్టాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్నాం…ఇప్పుడు కట్నం గురించి మాట్లాడుతావేంటీ అని కవిత భర్తతో అనేది.

ప్రియుడి గదిలో ప్రియురాలు ఆత్మహత్య


ఈ క్రమంలో గత నాలుగు రోజుల కిత్రం బిచ్కుందలో జరిగిన ఓ శుభకార్యానికి భార్యాభర్తలిద్దరూ కలిసి వెళ్లారు. అక్కడే ఇద్దరి మధ్యా గొడవ మొదలైంది. తరువాత గురువారం (నవంబర్ 26,2020)రాత్రి ఇంటికి చేరుకున్నారు. తెల్లవారింది. శుక్రవారం ఉదయం 8 గంటలప్పుడు రాజు భార్యను కేకేసి ‘‘నా జేబులో డబ్బులు కన్పింకన్పించడం లేదు..నువ్వేమన్నా తీశావా? అని అడిగాడు. దానికి కవిత నేనేం తీయలేదని చెప్పింది. కానీ అసలే భార్యపై పీకలదాకా కోపం ఉన్న రాజు దాన్ని అలుసుగా తీసుకుని..భార్యతో గొడవకు దిగాడు.
డబ్బులు నేను తీయలేదంటే నమ్మవేంటీ అని ఆమె అంది. దాంతో ఆవేశంతో రగిలిపోయిన రాజు భార్యను గొడ్డును బాదినట్లుగా బాదాడు. ఆ ఆవేశంలో అక్కడే ఉన్న ఓ కత్తితో భార్య కడుపులో పొడిచాడు. దీంతో దివ్య బాధతో విలవిలలాడుతూ కేకలు వేసింది. ఏడుస్తున్నా రాజు పట్టించుకోలేదు సరికదా..ఏడుపులు బైటకు వినిపించాయంటే ఇప్పుడు పొడిచి ఊరుకున్నాను..గట్టిగా ఏడ్చావంటే చంపేస్తానంటూ బెదిరించాడు.

అంతటితో ఊరుకోకుండా రక్తం కారుతున్న భార్య గాయానికి ఓ టవల్ చుట్టి గదిలో పెట్టి తాళం వేసేశాడు. రక్తం తీవ్రంగాకారిపోతుండటంతో భయపడిపోయి బాధతో విలవిల్లాడుతూ భర్తను ఆస్పత్రికి తీసుకువెళ్లమని బతిమాలుకుంది. కానీ రాజు కనికరించలేదు. తలుపు తీయలేదు.అలా సుమారుమూడు గంటల పాటు గదిలోనే బంధించాడు. గదిలో పడి ఆమె ఏడుస్తూనే ఉంది.
తరువాత భార్య చచ్చిపోతుందనే రాజుకు భయం వేసిందో ఏమో..రాజు తన తమ్ముడికి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పాడు. దీంతో అతను కవిత తల్లికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. దీంతో కవిత తల్లి కొడుకు, కోడలిని తీసుకుని ఘన్‌పూర్‌కు చేరుకుని..అల్లుడు పారిపోకుండా పట్టుకుని గదికి తాళం వేసి పోలీసులకు సమాచారం ఇచ్చింది.

వెంటనే వచ్చిన పోలీసులు రాథోడ్ రాజును అదుపులోకి తీసుకుని గాయపడిన కవితను డిచ్‌పల్లి క్లస్టర్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేసిన డాక్టర్లు ఆమెను వెంటనే మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం కవిత చికిత్సపొందుతోంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడు తనను చిత్రహింసలకు గురిచేయటం..పోలీసులు అరెస్ట్ చేయటం తలచుకుని ఇదేనా ప్రేమంటే..డబ్బులుంటేనే ప్రేమ ఉంటుందా? అని తనలో తాను కుమిలిపోతోంది.Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *