బీ పాస్‌.. బిందాస్‌ : TS-bPASS బిల్లుకు శాసనసభ ఆమోదం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ‌పెట్టిన‌‌ టీఎస్ బీపాస్ బిల్లు Telangana State Building Permissions Approval and Self Certification System (TS-bPASS) కు శాస‌న‌స‌భ ఆమోదం తెలిపింది. టీఎస్ బీపాస్ చ‌ట్టం వ‌ల్ల పేద‌లు, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్రజ‌ల‌కు మేలు జ‌రుగుతుంద‌ని మంత్రి కేటీఆర్‌ అన్నారు. మున్సిపాలిటీల ప‌రిధిల్లో 75 గ‌జాల లోపు స్థలంలో నిర్మాణానికి అనుమ‌తి తీసుకోవాల్సిన అవ‌స‌రం లేదని కేటీఆర్‌ అన్నారు.75 నుంచి 600 గజాల వ‌ర‌కు స్థలం ఉన్న వారు ఇన్‌స్టంట్ ప‌ర్మిష‌న్ తీసుకోవ‌చ్చని.. 600 గ‌జాల పైన స్థలం ఉన్న వారు 21 రోజుల్లోనే అన్ని అనుమ‌తులు ఇచ్చేలా చ‌ర్యలు తీసుకుంటామ‌న్నారు. 21 రోజుల్లో ప‌ర్మిష‌న్ రాక‌పోతే 22వ రోజు డీమ్డ్ అఫ్రూవ‌ల్ వ‌స్తుంద‌ని కేటీఆర్‌ స్పష్టం చేశారు. ఆక్యుపెన్సీ స‌ర్టిఫికెట్ కూడా 15 రోజుల్లోనే ఇస్తామ‌న్నారు.


Pharma City అడ్డుకోవడానికి కుట్రలు – కేటీఆర్


టీఎస్‌ బీపాస్‌ బిల్లు అమ‌లు ప‌ర్యవేక్షణ‌కు జిల్లా క‌లెక్టర్‌ ఆధ్వర్యంలో మానిట‌రింగ్ సెల్ ఏర్పాటు చేస్తామ‌ని కేటీఆర్ తెలిపారు. త‌ప్పుడు ప్రదేశంలో నిర్మాణాలు ఉంటే నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేస్తామ‌ని కేటీఆర్‌ స్పష్టం చేశారు.హైదరాబాద్‌లో రహదారుల అభివృద్ధికి నాలుగు రకాల ప్రణాళికలతో ముందుకుసాగుతున్నట్లు మండలిలో కేటీఆర్‌ తెలిపారు. నగరంలో కొత్త రోడ్లు వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే.. కేంద్రం సహకరించడం లేదని అన్నారు.రక్షణ రంగానికి చెందిన కంటోన్మెంట్‌ స్థలాలను రాష్ట్రానికి ఇవ్వడం లేదన్నారు. పట్టణ అభివృద్ధికి టీఎస్‌ బీపాస్‌ ఎంతో దోహద పడుతుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రజలు అక్రమ నిర్మాణాలు చేపట్టకుండా బాధ్యతగా వ్యవహరించాలన్నారు.

Related Posts