లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Telangana

కేటీఆర్.. కాబోయే సీఎం – పద్మారావు ఆసక్తికర వ్యాఖ్యలు

Published

on

Telangana Legislative Assembly Deputy Speaker Padmarao interesting comments : టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్..తెలంగాణ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. సికింద్రాబాద్‌లో నూత‌నంగా నిర్మించిన ద‌క్షిణ మ‌ధ్య రైల్వే ఉద్యోగుల సంఘం డివిజ‌న‌ల్ కార్యాల‌య ప్రారంభోత్సవ కార్య‌క్ర‌మంలో తెలంగాణ శాస‌న‌స‌భ డిప్యూటీ స్పీక‌ర్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే పద్మారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్‌ను పద్మారావు..కాబోయే సీఎం అంటూ సంబోధించారు. కాబోయే ముఖ్య‌మంత్రి కేటీఆర్‌కు కంగ్రాట్స్ అంటూ వ్యాఖ్యానించారు.

రైల్వే కార్మికులందరి తరపునా కాబోయే ముఖ్యమంత్రిని అభినందిస్తున్నానని పద్మారావు తెలిపారు. బ‌హుశా త్వ‌ర‌లోనే కాబోయే సీఎం కేటీఆర్‌కు శాస‌న‌స‌భ, రైల్వే కార్మికుల త‌ర‌పున శుభాకాంక్ష‌లు తెలుపుతున్న‌ట్లు పేర్కొన్నారు. ఈ కార్య‌క్ర‌మానికి మంత్రి కేటీఆర్ కూడా హాజ‌ర‌య్యారు. కేటీఆర్‌ను ఉద్దేశించి పద్మారావు… కాబోయే సీఎం అని వ్యాఖ్యానించగానే సభా ప్రాంగణం చప్పట్లతో దద్దరిల్లింది.

మంత్రి కేటీఆర్‌కు సీఎం అయ్యే అర్హ‌త‌లు ఉన్నాయ‌ని మంత్రులు గంగుల క‌మ‌లాక‌ర్, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవ‌ర్ద‌న్ రెడ్డి, ష‌కీల్ పేర్కొన్న విష‌యం విదిత‌మే. సీఎం ప‌ద‌వికి కేటీఆర్ స‌మ‌ర్థుడే అని వారు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకున్నా క‌ట్టుబ‌డి ఉంటామ‌ని స్ప‌ష్టం చేశారు.