లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

గ్రామాల్లో పేదింటి అమ్మాయిలే ఆమె టార్గెట్ : సిటీకి తీసుకొచ్చి..డబ్బాలు చేతికిచ్చి..

Published

on

Telangana woman forcing to girls for begging : మోసం చేసి డబ్బులు సంపాదించాలనే ఆలోచన వచ్చిందంటే..ఎదుటివారి ఆర్థిక పరిస్థితులు, బలహీనతల్ని ఎలా వాడుకోవాలని చూస్తారు. అలా తమకు ఎవరు చిక్కుతారా? అని వేచి చూస్తారు. అలా ఓ మహిళ గ్రామాల్లో పేదింటి పిల్లల్ని టార్గెట్ గా చేసుకుని వాళ్లకు ఉద్యోగాల్సిప్పిస్తానని నమ్మించి కొత్త దందాకు తెరలేపింది.

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ప్రాంతానికి చెందిన రవణమ్మ అనే 42 ఏళ్ల మహిళ చాలా ఏళ్ల క్రితమే హైదరాబాద్‌కు వచ్చింది. సులభంగా డబ్బు సంపాదించాలని కొత్త దందాకు తెరలేపింది. జడ్చర్ల ప్రాంతంలోని గ్రామాలకు వెళ్లి..ఇళ్లల్లో కూలి పనులకు వెళ్లే బాలికల వద్దకు వెళ్లి మాటలు కలుపుతుంది. అలాగే తెలిసిన వారి ఇళ్లకు వెళ్లి నెమ్మదిగా వారిని మాటల్లోకి దింపుతుంది. తరువాత నెమ్మదిగా వారి ఆర్థిక సమస్యల గురించి అడిగి తెలుసుకుంటుంది. ఆ తరువాత తన టార్గెట్ కు వాళ్లు బుట్టలో పడతారనే నమ్మకం కుదిరాక అసలు విషయాన్ని చెబుతుంది.

హైదరాబాద్‌లో ఉద్యోగం ఇప్పిస్తానంటూ..మాయమాటలు చెబుతుంది. ఆమె చెప్పే మాటలకు ఎవరైనా ఇట్టే పడిపోతారు. అంత లౌక్యంగా చెబుతుంది. అలా తన మాయ మాటలతో ముగ్గురు బాలికలను హైదరాబాద్‌కు తీసుకొచ్చింది. ఆ తరువాత నేను మీకు ఉద్యోగం ఇప్పించటానికి చూస్తున్నాను..ఆ ఉద్యోగం వచ్చేదాకా నేను చెప్పిన పనిచేయండీ..మీకు డబ్బులిస్తానని చెప్పింది.నిజమేనని వాళ్లు కూడా నమ్మారు.

అలా ఆ ముగ్గురు బాలికల చేతులకు తలోక డబ్బా ఇచ్చింది. ‘‘అనాథ పిల్లలకు సాయం చేయండి…వికలాంగుల సంక్షేమాన్ని చూసే మా ఫౌండేషన్‌కు సాయం చేయండి’ అంటూ అడగుతూ..ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద వాహనదారులు ఆగినప్పుడు వాళ్లను డబ్బులు అడగమని చెప్పింది. అందుకు ప్రతీ నెలా జీతం ఇస్తానని కూడా చెప్పింది. దీంతో తీరా తమను ఎంతో నమ్మకంగా తమ వాళ్లు పంపించారు. వాళ్ల కోసం ఎంతోకంత డబ్బు పంపించాలనే ఉద్ధేశ్యంతో ఆ బాలికలు ఆమె చెప్పిందల్లా చేస్తున్నారు. ఒక్కోరోజు ఒక్కో ఏరియాలోని ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర డబ్బాలతో డబ్బులు అడగటం చేస్తుంటారు.

అలా ఎంజే మార్కెట్ వంటి చోట్ల ఆ బాలికలు రోజంతా డబ్బులు అడిగి, ఆ డబ్బాలను సాయంత్రం రవణమ్మకు ఇచ్చేవారు. ఆ డబ్బులన్నీ రవణమ్మ స్వాధీనం చేసుకునేది. అలా ప్రతీరోజులాగానే గత ఆదివారం (జనవరి 10,2021) ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద డబ్బులు అడుగుతున్న బాలికలను స్మైల్ ఆపరేషన్ టీమ్ గుర్తించింది.

వారిని మీరు ఏ ఫౌండేషన్ తరుపున ఇలా విరాళాలు సేకరిస్తున్నారు? అని అడిగింది. దీంతో అసలు విషయాన్ని ఆ బాలికలు చెప్పటంతో రవణమ్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ బాలికలను చాంద్రాయణ గుట్ట రెస్క్యూ హోంకు తరలించారు. రవణమ్మపై కసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు పోలీసులు.