దుబాయ్ లో భార్య కోసం తెలంగాణ వ్యక్తి చేసిన ఫీట్ సోషల్ మీడియాలో వైరల్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

దుబాయ్ లో పొట్టకూటి కోసం వెళ్లిన తెలంగాణ వ్యక్తి చేసిన ఫీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. రమేశ్ గంగరాజన్ గాంధీ అనే వ్యక్తి క్లీనర్ గా పనిచేస్తున్నాడు. రోడ్డును క్లీన్ చేసే క్రమంలో చెట్లపై నుంచి రాలిన ఆకులను, పువ్వులను ఏరి హార్ట్ షేపులో పేర్చాడు.

‘గల్ఫ్ న్యూస్ తో మాట్లాడుతూ.. ఆ సమయంలో నా భార్యను బాగా మిస్ అయ్యాను. ఆమె గురించే ఆలోచిస్తూ అలా చేశాను’ అని చెప్పాడు. నేస్మా ఫరాహత్ అనే వ్యక్తి రమేశ్ పూరేకులను హార్ట్ షేపులో పేర్చడం గమనించి పిక్చర్ తీయడమే కాకుండా సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది.ద నేషనల్ కథనం ప్రకారం.. తెలంగాణకు చెందిన రమేశ్ దుబాయ్ కు పది నెలల క్రితం వచ్చాడు. ఎమ్రిల్ సర్వీసెస్ ఎల్ఎల్సీలో హౌజ్ కీపింగ్ స్టాఫ్ గా పనిచేస్తున్నాడు. సెప్టెంబరు 2019లో లత అనే అమ్మాయితో రమేశ్ కు వివాహమైంది. నెల రోజుల్లోనే అతను దుబాయ్ కు వెళ్లిపోగా లత ఇండియాలోనే ఉండిపోయింది.

జులై 15న క్లిక్ చేసిన ఫొటో వైరల్ అయి విపరీతంగా షేర్ కొట్టడంతో 1.5మిలియన్ ఫాలోవర్లకు చేరింది. నేను తన గురించి ఆలోచిస్తున్నానని తెలిస్తే ఆమె హ్యాపీగా ఫీలవుతుంది. మా గురించి ఇంతమందికి తెలిసిందంటే ఆశ్చర్యపోతుందని మీడియా ముందు వెల్లడించాడు రమేశ్. పైగా అతనితో పాటుగా వాళ్లిద్దరూ కలిసి దిగిన ఫొటో ఒక్కటి కూడా లేదు.


తన భార్యను బాగా మిస్సవుతున్నానని ఇంకొంచెం సమయం ఆమెతో ఉంటే బాగుండేదని చెప్పాడు. ఇతరుల్లాగే తను కూడా కుటుంబాన్ని బాగా మిస్ అవుతున్నట్లు తెలిపాడు.

లాక్ డౌన్ కారణంగా చాలా మంది వలస కార్మికులు విదేశాల్లోనే ఇరుక్కుపోయి కుటుంబ సభ్యులతో కలవలేకపోయారు. గాంధీ కూడా అనారోగ్యానికి గురైన తన తండ్రిని కలిసేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడట. తల్లీదండ్రి, భార్య, ఒమన్ లో పనిచేస్తున్న సోదరులను మిస్ అవుతున్నట్లు చెప్తున్నాడు రమేశ్.
Related Posts