లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Telangana

వేములవాడ రాజన్న సేవలో ముస్లిం మహిళ : కోడెదూడను కానుకగా ఇచ్చి మొక్కులు

Published

on

Telangana : Muslim woman  vemulavada rajanna temple : వేములవాడ రాజన్న ఆలయంలో ఓ అరుదైన ఘటన జరిగింది. ఓ ముస్లిం మహిళ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుంది. భక్తితో మొక్కులు చెల్లించుకుంది. స్వామివారి సన్నిధిలో అత్యంత భక్తి శ్రద్ధలతో మొక్కులు సమర్పించుకుంది. ఆమె కూడా ఓ కోడెదూడనును కూడా తీసుకొచ్చింది.

తెలంగాణలోని రాజన్న సిరిసిల్లా జిల్లాలోని శ్రీ కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. రాజరాజేశ్వర స్వామి కొలువై భక్తులకు కొంగుబంగారంగా వెలుగొందుతున్నాడు. ప్రతిరోజు వందలాదిగా వచ్చే భక్తులు స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. ప్రత్యేక పూజలు చేస్తూ… మొక్కులు చెల్లించుకుంటారు. ఒక శివరాత్రి వచ్చిదంటే ఆలయంలో భక్తుల రద్దీ బాగా ఉంటుంది. వేలాదిగా భక్తులు వచ్చి స్వామివారికి పూజలు చేస్తుంటారు.

భక్తుల కోర్కెలు తీర్చే రాజన్న స్వామిని మంగళవారం (జనవరి 26) మంథనికి చెందిన అఫ్సర్‌ శాసిత అనే ముస్లిం మహిళ దర్శించుకుంది. స్వామికి మొక్కులు చెల్లించుకుంది. అనంతరం స్వామివారికి కోడెమొక్కు చెల్లించుకున్నారు అఫ్సర్.

స్వామివారి మొక్కు చెల్లించుకున్న అనంతరం అఫ్సర్ శాసిత మాట్లాడుతూ..ఎప్పటినుంచే రాజన్న స్వామిని దర్శించుకోవాలని అనుకునేదాన్ననీ..ఈనాటికి స్వామివారి కరుణతో రాగలిగానని తెలిపారు. స్వామివారికి కోడెను కానుకగా మొక్కు చెల్లించుకున్నానని అఫ్పర్ తెలిపారు.