లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Crime Stories

క్రికెట్ బెట్టింగ్ చిచ్చు : డబ్బుల కోసం తల్లికి..చెల్లికి విషం పెట్టి చంపిన యువకుడు

Published

on

Telangana : medchal man poisoned his mother and sister : తల్లికి కొడుకుగా.. చెల్లికి అన్నగా అండగా నిలవాల్సినవాడు వారి పాలిట యముడిగా మారాడు. తన జల్సా కోసం..వ్యసనాల కోసం కన్నతల్లిని, తోడబుట్టిన చెల్లికి విషం పెట్టి చంపేశాడు. జులాయి పందాలకు అలవాటుపడిన ఆ యువకుడికి రక్తసంబంధాలనే అత్యంత పాశవికంగా తెంచేసుకున్నాడు. కుదురుగా ఉండరా కొడుకా..అన్న తల్లిని చంపేశాడు.వివరాల్లోకి వెళితే..తెలంగాణా హైదరాబాద్ శివారు ప్రాంతంలోని మేడ్చల్ లో నివాసముంటున్న ఓ కుటుంబంలో క్రికెట్‌ బెట్టింగ్ చిచ్చురేపింది. క్రికెట్ పందాలు మనకెందుకు కొడుకా..కుదురుగా ఉండరా అని మందలించిన కన్నతల్లికి..సొంత చెల్లికి అన్నంలో మత్తు బిళ్లలు కలిపి ఇద్దరినీ కడతేర్చిన ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్‌ మండలం రావల్‌కోల్‌ గ్రామానికి చెందిన ప్రభాకర్‌రెడ్డి మూడేళ్ల కిందట రోడ్డు ప్రమాదంలో మరణించారు. అప్పటినుంచి భార్య సునీత(42), కొడుకు సాయినాథ్‌రెడ్డి, కూతురు అనూషలను కంటికి రెప్పలా కాపాడుకుంటోంది.

తెగుతున్న బంధాలు : ప్రియుడి కోసం..రూ.10 లక్షల సుపారీ ఇచ్చి భర్త హత్య..
సునీత కుటుంబ పోషణ కోసం ప్రైవేటు కంపెనీలో పనిచేస్తోంది. కొడుకు సాయినాథ్‌రెడ్డి ఎంటెక్‌ పూర్తిచేసి ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. కూతురు అనూష బీఫార్మసీ చదువుతోంది. సునీత భర్త ప్రభాకర్‌రెడ్డి మృతిచెందిన అతను బ్రతికి ఉండగా చేసిన ఇన్సూరెన్స్‌ డబ్బు, కొంత భూమి అమ్మగా వచ్చిన డబ్బుని బ్యాంకులో వేశారు. అది కూతురు పెళ్లి కోసం కొడుకు భవిష్యత్తు కోసం ఉంటుందని భర్త ఇన్సూరెన్స్‌ డబ్బు..భూమి అమ్మగా వచ్చిన మొత్తం రూ. 20 లక్షలు బ్యాంకులో వేసింది సునీత. అలా సాఫీగా సాగిపోతున్న కుటుంబంలో క్రికెట్ బెట్టింగ్ చిచ్చుపెట్టింది. కొడుకుని కిరాతకుడిగా మార్చేసింది.ఇటీవల సాయినాథ్‌రెడ్డి ఐపీఎల్‌ క్రికెట్‌ బెట్టింగ్‌లకు అలవాటు భారీగా పందాలు కాసాడు. అది తెలిసిన తల్లి తల్లడిల్లిపోయింది. కొడుకు ఇలా పందాలకు అలవాటుపడితే వాడి భవిష్యత్తు ఏమవుతుందోనని ఆందోళన చెందింది. కొడుకును మందలించింది. బెట్టింగ్ లకు కాయొద్దని సూచించింది. కానీ తల్లి మాట పెడ చెవిన పెట్టిన సాయినాథ్ రెడ్డి బెట్టింగ్ లు మానలేదు. దీంతో అప్పులపాలయ్యాడు. దీంతో ఆ అప్పుల వాళ్లు ఒత్తిడితో తల్లికి తెలియకుండా బ్యాంకు నుంచి డబ్బు విత్‌డ్రా చేసి కొంత అప్పులు తీర్చి మిగిలిన డబ్బుని మళ్లీ బెట్టింగ్‌ల్లో పెట్టాడు.అంతటితో ఊరుకోకుండా ఇంట్లో ఉన్న 15 తులాల బంగారు నగల్ని కూడా పట్టుకెళ్లి అమ్మేసి బెట్టింగ్‌ల్లో పెడతామనుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న తల్లి తన కొడుకుని తిట్టింది. ఇంత జరిగినా ఇంకా నీకు బుద్ధిరాలేదు. ఇవికూడా తగలేస్తే ఇక నీ చెల్లి పెళ్లి ఎలా చేయాలి? మన కుటుంబానికి ఏదన్నా అవసరమొస్తే ఏం చేయాలి? అని కొడుకుని నిలదీసింది. తల్లిని సమర్థించింది చెల్లెలు.దీంతో బెట్టింగుల ఊబిలో కూరుకుపోయిన సాయినాథ్ రెడ్డికి తల్లి మాటలు రుచించలేదు. చెల్లి చెప్పిన మాటలు తలకెక్కలేదు. పైగా తన వ్యసనాలకు అడ్డు వస్తున్న తల్లిని..చెల్లిని అడ్డుతొలగించుకోవాలనుకున్నాడు. దానికో ప్లాన్ వేశాడు. ఈ క్రమంలో గత సోమవారం (నవంబర్ 23,2020) రాత్రి ఇంట్లో వండిన అన్నంలో రసాయన గుళికలు కలిపి ఏమీ తెలియనట్లుగా డ్యూటీకి వెళ్లిపోయాడు.ఈ విషయం తెలియని అమాయకపు తల్లి, చెల్లి మామూలుగానే భోజనం చేసి పడుకున్నారు. కొంత సేపటికి కడుపులో తిప్పినట్లుగా ఉందని తల్లీ కూతురు అనుకున్నాడు. ఇద్దరికీ అలా అయ్యేసరికి భయపడుతూ..కొడుకు ఫోన్ చేసి..సాయి నువ్వు పట్టుకెళ్లిన అన్నం తినొద్దు మాకు ఇలా అయ్యిందని తల్లి మనస్సుతో చెప్పింది.అయితే తను అనుకున్నది జరుగుతోందని తెలిసి ఏమీ తెలియనివాడిలో సాయినాథ్ రెడ్డి ఇంటికి వచ్చేశాడు. అలా ఇంటికి చేరుకున్న సాయినాథ్‌రెడ్డి కళ్లముందే తల్లీ, చెల్లీ కడుపునొప్పితో గిలగిలలాడుతుంటే చూస్తు కూర్చున్నాడు. వెంటనే హాస్పిటల్ కు తీసుకెళితే బతుకుతారని తెలిసే అలా చూస్తూ కూర్చున్నాడు. అలా ఇద్దరూ అపస్మారక స్థితికి చేరే వరకు వెయిట్ చేశాడు. ఆ తరువాత తాపీగా ఆస్పత్రికి తీసుకెళ్లాడు.అప్పటికే పరిస్థితి విషమించటంతో చికిత్స పొందుతూ గత శుక్రవారం అంటే 27న చెల్లెలు అనూష, శనివారం తల్లి సునీత ప్రాణాలు విడిచారు. ఈ విషయాన్ని తల్లీ చెల్లీ ఫుడ్ పాయిజన్ అయి చనిపోయారని బంధువులకు ఫోన్ చేసి చెప్పాడు.వెంటనే వచ్చిన బంధువులు అయ్యో..ఎంత పని జరిగింది? తండ్రిని పోగొట్టుకున్నావు..ఉన్నంతలో కుటుంబం అంతా కష్టపడుతూ బాగానే ఉన్నారు? ఇప్పుడిలా అయ్యిందేంటని సాయినాథ్ రెడ్డిని ఓదార్చారు. కానీ సాయినాథ్ రెడ్డి బెట్టింగ్ ల గురించి తెలిసిన కొంతమంది బంధువులకు అనుమానం వచ్చింది.దీంతో సాయినాథ్ ను నిలదీశారు. కానీ సాయినాథ్ ఒప్పుకోలేదు. గట్టిగా నిలదీశారు. నిజం చెప్పు లేదంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తే వాళ్లే చెప్పిస్తారు నిజం అని బెదిరించేసరికి అసలు విషయం ఒప్పుకున్నాడు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేసుకున్న మేడ్చల్‌ పోలీసులు సాయినాథ్ రెడ్డిని అరెస్ట్ చేసి విచారించగా పోలీసుల దగ్గరకూడా తల్లీకి చెల్లి తినే అన్నంలో విషపు మాత్రకు కలిపి పెట్టానని ఒప్పుకున్నాడు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *