హీరోయిన్‌ను ట్రాప్ చేయాలని యత్నించిన తెలంగాణ మంత్రి

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Telangana Minister Scandal: ఆ సినిమా హీరోయిన్ ను మంత్రి మానసికంగా వేధించారట. కొద్ది రోజుల పాటు ఆమెకు వెళ్లిన మెసేంజర్‌లో మెసేజ్‌లు, వాట్సప్ మెసేజ్‌లు ఇవే చెప్తున్నాయి. ఆ మంత్రి కోర్కె తీర్చాలని ఒకట్రెండు సినిమాల్లో నటించిన హీరోయిన్ పై ఒత్తిడి తెచ్చాడు. అదే పనిగా పెట్టుకుని ఆమెను కన్విన్స్ చేయాలని పురమాయించాడు.

పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్, డబ్బు ఆశ చూపించినా ఆ హీరోయిన్ లొంగకపోవడంతో బ్లాక్‌మెయిల్‌కు రెడీ అయ్యారు. ప్రైవేట్ ఫొటోలను తీసి ఆమెను టార్గెట్ చేయాలనుకున్నారు. ఇలా చేస్తుండగా హీరోయిన్ కు మీడియేటర్ పై అనుమానం వచ్చింది. ఫోన్ లాక్కొని చూడటంతో అసలు విషయం బయటపడింది.మసాజ్ కావాలంటూ.. ఫుల్ గా కావాలంటూ పదేపదే అదేరకమైన మెసేజ్‌లు పంపి ఎలాగైనా ఒప్పించాలంటూ ట్రాప్ చేయాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుసుకుంది. అంతేకాకుండా తన ఫొటోలను కూడా తీసి బ్లాక్ మెయిల్ చేయాలని ప్లాన్ చేసుకున్నట్లు అర్థమైంది. ఫోన్‌తో సహా దూరంగా అంటే హైదరాబాద్ కు వచ్చేసిన హీరోయిన్ సోషల్ మీడియాలో స్క్రీన్ షాట్లను పోస్టు చేసింది.

ఇదంతా బయటకు రావడంతో రూటు మార్చిన మంత్రి వివరణ ఇచ్చుకునేందుకు అధిష్టానాన్ని ఆశ్రయించారు. 10టీవీ కథనం, ఇంటెలిజెన్స్ ఎంట్రీతో మంత్రి రూట్‌ మారింది. పార్టీ పెద్దలకు సంజాయిషీ ఇచ్చుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

Related Tags :

Related Posts :