కర్నాటకలో హింస..బాధ్యతాయుతంగా మెలగండి – కేటీఆర్ ట్వీట్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కర్నాటక రాష్ట్రంలోని డీజే హళ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీనివాసమూర్తి ఇంటి వద్ద చోటు చేసుకున్న ఘటనపై తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ స్పందించారు. నకిలీ వార్తలను సోషల్ మీడియా వ్యాప్తి చేయడం ద్వారా ఎంత ప్రమాదకరమో ఈ ఘటనే చూపిస్తోందని తెలిపారు.

సోషల్ మీడియాలో ఉండే..యూజర్లు…బాధ్యతాయుతంగా మెలగాలని కేటీఆర్ అభ్యర్థించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. అనుచిత ప్రచారం చేయొద్దని, సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు సోషల్ మీడియా సాధనంగా మార్చొద్దు అంటూ మరోసారి సూచించారు.


అసలు బెంగళూరులో ఏం జరిగింది ?
కర్ణాటక రాజధాని బెంగుళూరులోని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీనివాస మూర్తి మేనల్లుడు సోషల్ మీడియాలో ఓ వర్గాన్ని కించపరిచేలా పోస్టు చేశారని ప్రచారం జరిగింది. ఆగ్రహానిక గురైన కొంతమంది ఎమ్మెల్యే నివాసంపై దాడికి పాల్పడ్డారు. అక్కడున్న వాహనాలకు నిప్పు పెట్టడంతో ఆందోళన హింసాత్మకంగా మారింది.

ఘటనా స్దలానికి చేరుకున్న పోలీసులు దాడి చేస్తున్న వారిని అదుపు చేయటం కోసం లాఠీ చార్జీ చేశారు. అయినా వారు వెనకడుగు వెయ్యక పోగా పోలీసులపై రాళ్ళదాడి చేశారు.
పరిస్ధితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మరణించారు. రాళ్ల దాడిలో పోలీసులకు కూడా గాయాలయ్యాయి. ప్రస్తుతం పరిస్థితిలో అదుపులోనే ఉందని సమాచారం.

Related Posts