మేక పాలు తాగి పెరుగుతున్న ఆవుదూడ

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Telangana Nirmal cow calf drinking goat milk : తెలంగాణాలో నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో ఓ వింత జరుగుతోంది. ఓ ఆవుదూడ మేక పాలు తాగి పెరుగుతోంది. వానకార్ శ్రీనివాస్ అనే వ్యక్తి మేకలు మందను పెంచుతున్నాడు. అతనికి చాలా మేకలున్నాయి. మేకల మందతోపాటు శ్రీనివాస్ ఓ ఆవును కుడా పెంచుకున్నాడు. ఆ ఆవుకు ఓ దూడ పుట్టిన తరువాత అనారోగ్యంతో చనిపోయింది.

దీంతో ఆ ఆవుదూడ కు మేకల మందలోని మేక పాలు పట్టించడం అలవాటు చేశాడు శ్రీనివాస్. ఆ ఆవుదూడకు ఆకలేస్తే చాలు మేకల మంద దగ్గరకు పరుగెట్టుకుంటూ వచ్చేస్తోంది అప్పుడు శ్రీనివాస్ ఓ తల్లిమేకను తీసుకొచ్చి ఆ ఆవుదూడకు పాలు తాగిస్తాడు.

ఇలా ప్రతిరోజు మేకపాలు తాగుతూ పెరుగుతున్న ఆవు దూడ మేకల మందతో కలిసి మేతకు వెళుతుంది. అవి ఎటుపోతే అటు వాటితో కలిసిపోయి తిరుగుతొంది. దూడకు ఆకలి వేస్తే అరుస్తుంది. ఆ అరుపు విన్న మేకలు దాని దగ్గరికి వస్తాయి. అది పాలు తగుతున్నంత సేపు కదలకుండా అక్కడే ఉండి పోతాయి.

అయితే మేకల మందతో మేతకు వస్తున్నా మేత మెయ్యకుండ మేకల దగ్గరికి వచ్చి వాటి పాలు తాగుతుందని మేకల కాపరి చెబుతున్నాడు. మేకలలో మేక గా కలిసిపోయి ఆ మందలో ఉన్న దూడ ను చూసి అందరూ షాక్ అవుతున్నారు.

కాగా మనుషులకు మనుషులు సహాయం చేసుకోని ఈరోజుల్లో మనుషుల కంటే జంతువులే నయం అనిపిస్తున్న ఘటనలు చాలా చూశాం. జాతి వైరాన్ని మరిచి సఖ్యతతో మెలుగుతున్న జంతువుల్ని కూడా చూశాం. ప్రేమానురాగాలను పంచడంలో మనుషులకన్నా జంతువులే మిన్నా అని నిరూపిస్తున్నాయి ఈ మూగజీవాలు.

Related Tags :

Related Posts :