Telangana Panchayat Election EC Elections To Be Held In 3 Phases | 10TV

పంచాయతీ ఎన్నికలు : అర్హతలు..అనర్హతలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల కోడ్ కూడా కూసేసింది. సర్పంచ్.. వార్డు సభ్యులకు ఎన్నికల అధికారులు గుర్తులు కేటాయించారు.

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల కోడ్ కూడా కూసేసింది. సర్పంచ్.. వార్డు సభ్యులకు ఎన్నికల అధికారులు గుర్తులు కేటాయించారు. మరి సర్పంచ్ పదవికి పోటీ చేయాలంటే ఎలాంటి అర్హతలుండాలి ? అనర్హతలు ఏంటీ ? అనే దానిపై ఎన్నికల సంఘం మార్గదర్శకాలు జారీ చేసింది. 
అర్హతలు : 

– అభ్యర్థి వయస్సు 21 ఏళ్లకంటే తక్కువ ఉండకూడదు. నామినేషన్ల పరిశీలన తేదీ నాటికి అభ్యర్థికి 21 ఏళ్లు ఉండాలి. 
– పోటీ చేసే అభ్యర్థి కచ్చితంగా పోటీ చేసే పంచాయతీలో సభ్యుడిగా ఉండాలి. 

– ఎస్సీ, బీసీ రిజ్వర్వుడ్ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు తెలంగాణ రాష్ట్రానికి చెందిన షెడ్యూల్డ్ కులాలు లేదా వెనుకబడిన తరగతులుగా ప్రకటించిన ఏదైనా సామాజికవర్గానికి చెందిన వారు ఉండాలి. 

– ఎస్సీ రిజర్డ్ స్థానాల్లో అభ్యర్థులు అభ్యర్థులు షెడ్యూల్డ్ తెగలు (తెలంగాణకు సంబంధించిన)గా ప్రకటించిన ఏదైనా ఒక కులం, తెగకు (కమ్యూనిటీ) చెందిన వారై ఉండాలి. 

– మహిళలతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీలకు చెందిన వారు అన్ – రిజర్వ్‌డ్ స్థానాలకు పోటీ చేయొచ్చు. 

– రేషన్ డీలర్లు, సహకార సంఘాల సభ్యులు అర్హులు.  

– రాష్ట్ర ప్రభుత్వ వాటా 25 శాతం లోపుగా ఉన్న సంస్థల ఏజెంట్ / మేనేజర్ / కార్యదర్శుల సైతం పోటీకి అర్హులు. 

– పంచాయతీ ఎన్నికల్లో పోటీకి ఆర్టీసీ, సింగరేణి సంస్థల్లో మేనేజింగ్ ఏజెంట్ / మేనేజర్ / కార్యదర్శులు తప్ప మిగిలిన ఉద్యోగులు అర్హులు. 

అనర్హతలు :

– రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రస్తుతం అమల్లో ఉన్న ఏదైనా చట్టం ప్రకారం సభ అనర్హులుగా ప్రకటించిన వారు అనర్హులు. 

– క్రిమినల్ కోర్టు ద్వారా శిక్ష పడితే సర్పంచ్ పదవికి అనర్హులు. 

– మతిస్థిమితం లేనివారు.. చెవిటి మూగ వారు అనర్హులు.

– మత సంబంధ సంస్థల ఛైర్మన్, సభ్యులు అనర్హులు. 

– పార్లమెంట్ లేదా అసెంబ్లీ ద్వారా చట్టబద్దత పొందిన ఏదైనా సంస్థలో ఆఫీస్ బేరర్‌గా ఉండకూడదు. 

– ఏదైనా పారితోషకం పొందుతూ పంచాయతీ తరపున లేదా దానికి వ్యతిరేకంగా లీగల్ ప్రాక్టీషనర్‌గా పనిచేస్తున్న వారు అనర్హులు. 

– రాష్ట్ర ప్రభుత్వ వాటా 25 శాతం లేదా అంతకన్నా ఎక్కువగా ఉన్న కంపెనీలు…కార్పొరేషన్‌లలో మేనేజర్, కార్యదర్శిగా పనిచేసే వారు. 

READ  కాంగ్రెస్ కు నిరాశ మిగిల్చిన మున్సిపల్ ఎన్నికలు

– ప్రస్తుత, గత ఆర్థిక సంవత్సరంలో గ్రామ పంచాయతీకి, పడిన బకాయిని చెల్లించాలంటే బిల్లు / నోటీసులు అందుకుని.. గడువులోగా బకాయి చెల్లించని వారు అనర్హులు. 

– గ్రామ సహాయకునిగా (వీఆర్ఓ), కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి అధికారి, స్థానిక సంస్థల్లో, ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం పొందుతున్న సంస్థల్లో ఉద్యోగిగా ఉన్న వారు అనర్హులు. 

– దివాలా తీసిన లేదా దివాలా నుండి వెలుపలికి రాని వ్యక్తిగా కోర్టు నిర్ణయించిన వారు, ఇన్ సాల్వెన్సీకి దరఖాస్తు చేసుకున్న వారు అనర్హులు. 

Related Posts