లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Telangana

రాయగిరి రైల్వే స్టేషన్ పేరు యాదాద్రి రైల్వే స్టేషన్‌గా మార్పు, దక్షిణ మధ్య రైల్వే ఉత్తర్వులు

Published

on

telangana-raigir-railway-station-renamed-as-yadadri-railway-station

యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరి రైల్వేస్టేషన్‌ పేరు మారింది. రాయగిరి రైల్వేస్టేషన్ పేరుని యాదాద్రి రైల్వే స్టేషన్‌గా మార్పు చేశారు. ఈ మేరకు కేంద్రం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దుతున్న విషయం తెలిసిందే.

యాదాద్రి ఆలయ పునర్ నిర్మాణం, అభివృద్ధి పనులు పూర్తయితే దేశ నలుమూలల నుంచి రోజూ లక్ష మంది భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ క్రమంలో ఘట్‌కేసర్‌ వరకు ఉన్న ఎంఎంటీఎస్‌ను రాయగిరి వరకు పొడిగించాలని, దీంతో పాటు రాయగిరి రైల్వేస్టేషన్‌ పేరును యాదాద్రి రైల్వే స్టేషన్‌గా మార్చాలని 2016లో తెలంగాణ సీఎం కేసీఆర్‌ కేంద్రాన్ని కోరారు.

ఈ క్రమంలో ఎంఎంటీఎస్‌ను మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం రైల్వే స్టేషన్‌ పేరును కూడా మార్పు చేసింది. ఇందుకు సంబంధించి సెప్టెంబర్ 18న దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఉత్వర్వులు జారీ చేశారు. కాగా 2019 సెప్టెంబర్‌లో రాష్ట్ర ప్రభుత్వ గెజిట్‌లో పేరు మారుస్తూ ఆదేశాలు జారీ చేశారు.

యాదగిరిగుట్టకు రాయగిరి రైల్వే స్టేషన్‌ మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. సికింద్రాబాద్‌ – ఖాజీపేట సెక్షన్‌లో భువనగిరి – వంగపల్లి మధ్యన రాయగిరి రైల్వే స్టేషన్‌ ఉంది. రాయగిరిలో రైలు దిగి యాదగిరిగుట్టకు భక్తులు వెళ్తారు.

కేంద్ర ప్రభుత్వ నిర్ణయం హర్షణీయం:
రాయగిరి రైల్వే స్టేషన్‌ పేరు యాదాద్రి రైల్వే స్టేషన్‌గా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై భువనగిరి మాజీ ఎంపీ డాక్టర్‌ బూరనర్సయ్యగౌడ్‌ హర్షం వ్యక్తం చేశారు. రైల్వే స్టేషన్‌కు పేరు మార్పుతో యాదాద్రి దేశ వ్యాప్తంగా ప్రాముఖ్యతను సంతరించుకుంటుందన్నారు. 2016లో యాదాద్రి వరకు ఎంఎంటీఎస్‌ కేంద్రం మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి, రైల్వే శాఖకు కృతజ్ఞతలు తెలిపారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *