TELANGANA seeds ready to export Europe

యూరప్‌కు ఎగుమతి చేసేందుకు తెలంగాణ వేరుశనగ విత్తనాలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

తెలంగాణ వ్యవసాయం మరో స్థాయికి చేరుకుంది. రాష్ట్రంలో పండిన వేరుశనగ విత్తనాలను యూరప్ కు ఎగమతి చేస్తూ కూరగాయలు, విత్తనోత్పత్తిలో నాణ్యతను చాటామనడానికి నిదర్శనంగా మారింది.

తెలంగాణ వ్యవసాయం మరో స్థాయికి చేరుకుంది. రాష్ట్రంలో పండిన వేరుశనగ విత్తనాలను యూరప్ కు ఎగమతి చేస్తూ కూరగాయలు, విత్తనోత్పత్తిలో నాణ్యతను చాటామనడానికి నిదర్శనంగా మారింది. ఆస్ట్రేలియా వంటి దేశాన్ని పక్కకుబెట్టి విత్తనాలను ఎగుమతి చేయగలమని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. 

జర్మనీ – నెదర్లాండ్స్‌ పర్యటనలో భాగంగా ఆదివారం నెదర్లాండ్స్‌ లోని ఆమ్‌స్టర్‌డ్యాంలో వేరుశనగ దిగుమతిదారులు, కూరగాయల విత్తనోత్పత్తి చేసే కంపెనీలతో ఏర్పాటు చేసిన మీటింగ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలోనే వేరుశనగ ఉత్పత్తిలో ఉమ్మడి పాలమూరుది ప్రథమ స్థానం. మూడేళ్లుగా దేశంలో వేరుశనగ ఉత్పత్తిలో రికార్డు సాధిస్తున్నాం. నెదర్లాండ్స్‌లో వేరుశనగ వాడకం అధికమని, ఆ దేశానికి ఆస్ట్రేలియా నుంచి అధికంగా దిగుమతి అవుతుందన్నారు. 

తెలంగాణలో ఉత్పత్తి అవుతున్న వేరుశనగ ముంబై, ఢిల్లీల్లో ఉండే దళారులు, మధ్యవర్తుల ద్వారా ఇతర దేశాలకు ఎగుమతి అవుతుంది. రైతుకు సరైన లాభం రావడం లేదన్నారు. ఇలా కాకుండా నేరుగా విదేశాలకు వేరుశనగ ఎగుమతి చేస్తామన్నారు. వేరుశనగను యూరోపియన్‌ యూనియన్‌ దేశాలు, ఇండోనేషియా, కెనడా, సింగపూర్, మలేసియా, ఫిలిప్పైన్స్‌ తదితర దేశాలు దిగుమతి చేసుకుంటున్నాయన్నారు.

డిసెంబరులో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాను సందర్శించి వేరుశనగ ఉత్పత్తికి సంబంధించిన స్టేక్‌ హోల్డర్స్‌ తో సమావేశం అవుతామని నెదర్లాండ్స్‌ ప్రతినిధులు పేర్కొన్నారు.

Related Posts