తెలంగాణలో రోజుకూ లక్ష వరకు కరోనా పరీక్షలు!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Lakhs of Covid tests in Telangana : దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. కరోనా పరీక్షలను భారీగా పెంచాలంటూ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. కరోనా పరీక్షల విషయంలో రాష్ట్రాలకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ లేఖ రాసింది. కరోనా పరీక్షలను పూర్తి స్థాయిలో నిర్వహించాలని ఆదేశించింది.దాంతో తెలంగాణ రాష్ట్రంలో రోజుకు లక్ష వరకు జరిపేలా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ రెడీ అవుతోంది. ప్రస్తుతం రోజుకు 40 వేల వరకు మాత్రమే పరీక్షలు నిర్వహిస్తున్నారు.

1076 ఆసుపత్రుల్లో, 310 మొబైల్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌లలో ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్టులు, 18 ప్రభుత్వ, 50 ప్రైవేటు ల్యాబ్‌లలో RTPCR టెస్టులు నిర్వహిస్తున్నారు.

నో మాస్క్ నో ఎంట్రీ, జీహెచ్ఎంసీ ఎన్నికలకు కరోనా గైడ్ లైన్స్ విడుదల చేసిన ఎస్ఈసీ


రోజుకు లక్ష వరకు పరీక్షలు చేసే సామర్థ్యం ఉందని, పూర్తిగా వినియోగించుకోవాలని సూచిస్తోంది. శీతాకాలంలో వైరస్‌ వ్యాప్తిని నియంత్రించేందుకు ఎక్కువ సంఖ్యలో పరీక్షలు చేయాలి.

కరోనా లక్షణాలు ఉన్న బాధితులకు ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చిన వారికి ఆర్‌టీపీసీఆర్‌ పరీక్ష చేయాలని కేంద్రం లేఖలో సూచించింది.తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 952 కరోనా కేసులు రికార్డయ్యాయి. సోమవారం రాత్రి 8 గంటల వరకు 38,245 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు.

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 150 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో 77 కేసులు నమోదయ్యాయి.ఇక కొత్తగూడెంలో 71, రంగారెడ్డి జిల్లాలో 68 కరోనా కేసులు నమోదయ్యాయి. మిగిలిన జిల్లాల్లో 50 కేసుల కంటే తక్కువగా నమోదయ్యాయి. మరో ముగ్గురు కరోనా మహమ్మారితో మృతి చెందారు.

రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 1,410కి చేరింది. సోమవారం 1,602 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.ప్రస్తుతం 13,732 మంది కరోనా ట్రీట్ మెంట్ తీసుకుంటుండగా.. 11,313 మంది హోం ఐసోలేషన్‌లో కరోనా ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. ఏపీలో కరోనా కేసులలో రెండు రోజుల్లో 2శాతం లోపు కేసులు నమోదయ్యాయి.కరోనా పరీక్షల్లో 2.08శాతం మందికి వైరస్‌ బారిన పడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా 66,778 శాంపిల్స్ పరీక్షించారు.

1,395 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. కృష్ణా జిల్లాలో అత్యధికంగా 260 కేసులు నమోదు కాగా.. కర్నూలులో 18 కేసులు నమోదయ్యాయి.

Related Tags :

Related Posts :