Updated On - 1:51 pm, Sun, 17 January 21
two Men arrested for rapeing girls in suryapet : సోషల్ మీడియా ద్వారా అమ్మాయిలకు వలవేసి వారిని ప్రేమలోకి దింపి వారిపై అత్యాచారం చేసిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కా,చెల్లెళ్లపై అత్యాచారం చేసిన ఘటనలో నిందితుడ్ని అరెస్ట్ చేయటంతో ఇతని బాధితులు మరింత ఎక్కువ మంది ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
సుర్యాపేటలో ఒంటరి తల్లితో నివసిస్తున్న ఇద్దరు అక్కచెల్లెళ్ళలో పెద్ద కుమార్తె(17)కి మునగాలకు చెందిన చింతకాయల ఉదయ్ మూడేళ్ల క్రితం ఇన్ స్టాగ్రాం ద్వారా పరిచయమయ్యాడు. ఉదయ్ కొంతకాలం కోదాడలోని ప్రైవేట్ ఆస్పత్రిలో కాంపౌండర్ గా పని చేసి, ఇటీవలే సూర్యాపేటలోని మరో ప్రైవేట్ ఆస్పత్రిలో చేరాడు. ఇన్ స్టా గ్రాంలో పరిచయమైన 17 ఏళ్ల బాలికను ప్రేమించాలని, పెళ్లి చేసుకుంటానని….. లేకపోతే చచ్చిపోతానని బెదిరించి ఆమెను లొంగదీసుకున్నాడు.
బాలికను పట్టణంలోని తన స్నేహితుడి రూమ్ కు తీసుకు వెళ్లి పలుమార్లు అత్యాచారం చేసినట్లు బాలిక పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపింది. ఆమెను బెదిరించి రూ. 2లక్షలు కూడా తీసుకున్నాడు. ఉదయ్ ద్వారానే ఆమె చెల్లెల్లు(15) ను సూర్యాపేట రాజీవ్ నగర్ కు చెందిన బాలుడికి పరిచయం చేశాడు. ఇతనూ ఆమెను అదే గదికి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు.
బైక్ కొనుక్కునేందుకు రూ. 50 వేలు బెదిరించి తీసుకున్నట్లు బాధితురాలు పోలీసులకువాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం . కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఉదయ్ సెల్ ఫోన్ పరిశీలించగా మరికొంత మంది యువతులను ఇదేరకంగా బెదిరించి అత్యాచారం చేసినట్లు తెలుసుకున్నారు. బాధిత యువతుల గురించి పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు.
గిరిజనులే టార్గెట్..అనారోగ్యంతో ఉన్నవారికి బీమా..నామినీతో ఒప్పందం చేసుకుని హత్యలు..!!
వైఎస్ షర్మిల పార్టీకి ముహూర్తం ఫిక్స్, ఏప్రిల్ 9న పేరు ప్రకటించే చాన్స్, ఆ రోజునే ఎందుకు ఎంచుకున్నారంటే..
యాంకర్ పోస్టు ఇప్పిస్తానని రూ.25లక్షలు కొట్టేసిన మాయగాడు
రామచంద్రారావు ట్వీట్ పై కేటీఆర్ సెటైర్లు..
హోంవర్క్ తప్పించుకునేందుకు అత్యాచారం కథ అల్లిన టెన్త్ విద్యార్థిని
లాయర్ దంపతుల హత్య : బ్యారేజీలో కత్తులు దొరికేనా