ఎందరికో ఆయిష్షు పోసిన డాక్టర్.. అనాథలా.. హైదరాబాద్‌లో ఓ కరోనా కన్నీటి కథ

ఇప్పుడు దేశవ్యాప్తంగానూ... ప్రపంచవ్యాప్తంగానూ.. ఎక్కడ చూసినా కరోనా కన్నీటి కథలే.. చాలామందికి చివరిచూపు కూడా దక్కని పరిస్థితి. ఈ క్రమంలోనే నెల్లూరు జిల్లాలో ఓ డాక్టర్ పరిస్థితి విన్

ఎందరికో ఆయిష్షు పోసిన డాక్టర్.. అనాథలా.. హైదరాబాద్‌లో ఓ కరోనా కన్నీటి కథ

Heart Touching Story Of A D

ఇప్పుడు దేశవ్యాప్తంగానూ… ప్రపంచవ్యాప్తంగానూ.. ఎక్కడ చూసినా కరోనా కన్నీటి కథలే.. చాలామందికి చివరిచూపు కూడా దక్కని పరిస్థితి. ఈ క్రమంలోనే నెల్లూరు జిల్లాలో ఓ డాక్టర్ పరిస్థితి విన్నాం.. చూశాం.. అయినవాళ్లు దగ్గరకు రాలేని పరిస్థితి. అటువంటి పరిస్థితే హైదరాబాద్ నగరంలో మరో డాక్టర్ గారికి కూడా వచ్చింది.

తన జీవితకాలంలో ఎంతోమందికి వైద్యం చేసిన ఆయన.. పేరుపొందిన యునానీ వైద్యుడు. 52 ఏళ్ల వయసులో ఎంతో చురుకుగా పనిచేస్తూ ఎంతోమందికి సేవ చేశారు. హైదరాబాద్‌లోని ఏసీ గార్డ్స్ ప్రాంతంలో క్లినిక్‌ను నడుపుతున్న అతని వద్దకు నాంపల్లి, మాసబ్ ట్యాంక్, మెహిదీపట్నం, ఖైరతాబాద్ తదితర ప్రాంతాల నుంచి నిత్యం ఎంతో మంది వస్తుంటారు. అంతటి పేరున్న డాక్టర్, కరోనా కారణంగా మరణిస్తే, అంత్యక్రియలు చేసేందుకు నా అన్నవారు లేని, రాలేని పరిస్థితి.

అగాపురా పరిధిలో ఈ ఘటన జరుగగా తమ డాక్టర్ మరణించారనే విషయం తెలుసుకున్న ప్రజలు, కన్నీరు పెడుతున్నారు. అయితే దగ్గరకు రాలేని పరిస్థితి ప్రతి ఒక్కరిది. ఈ నెల 11వ తేదీన ఊపిరి పీల్చుకోవడంలో డాక్టర్ ఇబ్బంది పడుతూ ఉండటంతో నాంపల్లి ఆసుపత్రికి, ఆపై బంజారాహిల్స్‌లో ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లారు. 13న ఆయనకు కరోనా పాజిటివ్ అని తెలియగా.. వెంటనే కుటుంబ సభ్యులను గాంధీ ఆసుపత్రికి తరలించారు.

ఇంట్లోని మిగతా వారందరికీ కరోనా సోకినట్టు తేలగా.. అతని భార్య, తల్లి, సోదరి, సోదరుడు.. అందరూ గాంధీలోని ఐసొలేషన్ వార్డులో చేరారు. బంధువులంతా హోమ్ క్వారంటైన్‌లో ఉండగా.. అంత్యక్రియలు నిర్వహించే వీలు లేకపోవడంతో జీహెచ్ఎంసీ సిబ్బంది ఆయనకు ఖననం చేశారు.