అష్టా చెమ్మ ఆడింది…సూర్యాపేటలో 31 మందికి కరోనా అంటించింది

అష్టా చెమ్మ ఆడింది…సూర్యాపేటలో 31 మందికి కరోనా అంటించింది

తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఇంకా తాండవం చేస్తోంది. ఇప్పటికే లాక్ డౌన్ కఠినంగా అమలు చేస్తున్నారు. ప్రజలు ఎవరూ బయటకు రావొద్దని..వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకుతుందని..బతికుంటే బలిసాకు తినొచ్చు..ఎక్కడి వారెక్కడే ఉండాలని..వైరస్ ఎలా వ్యాపిస్తుందో ఎవరికీ తెలియదని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

ఇక ఇళ్లల్లో ఉన్న వారు బోర్ కొట్టకుండా..ఏదో ఒక పని చేసుకుంటూ టైం పాస్ చేస్తున్నారు. మహిళల సంగతి చెప్పనవసరం లేదు. చిన్న చిన్న గేమ్స్ ఆడుతున్నారు. ఇలాగే…ఓ మహిళ ఇతర ఇండ్లకు వెళ్లి గేమ్స్ ఆడింది. ఈమె ద్వారా 31 మందికి కరోనా సోకిందనే వార్త హాట్ టాపిక్ అయ్యింది. ఈమె ఇటీవలే ఢిల్లీ మర్కజ ప్రార్థనలకు వెళ్లి వచ్చినట్లు తేలింది.

తెలంగాణలో సూర్యాపేటలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న తీరు సర్వాత్రా ఆందోళ కలిగిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ తర్వాత ఇక్కడే అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఒక్క మహిళ ద్వారా చాలా మందికి కరోనా సోకిందని అధికారులు గుర్తించారు. ఈ మహిళ ఇటీవలే ఢిల్లీలోని మర్కజ్ ప్రార్థనలకు వెళ్లి వచ్చింది. అనంతరం సూర్యాపేటకు వచ్చి..ఇతరుల ఇంట్లో అష్టాచెమ్మ ఆడడానికి వెళ్లేది. ఈమెకు కరోన సోకిందనే విషయం తెలిసేగానే..వైరస్ విస్తృతంగా వ్యాపించింది. మొత్తం 31 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారించారు వైద్యులు. వీరందరినీ క్వారంటైన్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అష్టా చెమ్మ కొంపముంచిందని అనుకుంటున్నారు.

మరోవైపు…సూర్యాపేటలో కరోనా స్పీడుగా వ్యాపించడంపై సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు. రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్ తర్వాత కరోనా రాకాసి సూర్యాపేట, గద్వాల, వికారాబాద్ ల్లో అధికంగా ప్రబలుతున్న సంగతి తెలిసిందే. దీంతో సీఎం కేసీఆర్ ఆదేశాల ప్రకారం..ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారీలు రంగంలోకి దిగారు. అధికార యంత్రాంగంపై సరైన పర్యవేక్షణ లేదని, సరిహద్దులో ఉండడం వల్ల సమస్యలు ఏర్పడ్డాయని తెలుసుకున్నారు. మర్కజ్ వెళ్లివచ్చిన వారి కదలికలను, కరోనా వైరస్ విస్తరణ అవకాశాలను అంచనా వేయడంలో అధికారుల‌ నిర్లక్ష్యం వహించడంపై ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. పలువురిని బదిలీ చేసింది