కారు పాస్ కోసం ఫ్రిజ్ లంచం : DGP ఆఫీసుకు మంచిర్యాల ACP అటాచ్

కారు పాస్ కోసం ఫ్రిజ్ లంచం : DGP ఆఫీసుకు మంచిర్యాల ACP అటాచ్

కరోనా కారణంగా తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నారు. ప్రజలు రోడ్డెక్కకుండా చూస్తున్నారు. అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప..ప్రయాణం చేయవద్దని అటు ప్రభుత్వం..ఇటు పోలీసు ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. అయిన అక్రమమార్గంలో ప్రయాణాలు చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే పాస్ లను తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. పాస్ ఇవ్వడానికి లంచం తీసుకున్నారని మంచిర్యాల ఏసీపీపై ఆరోపణలు వినిపిస్తున్నాయి.

లాక్ డౌన్ నేపథ్యంలో పోలీసులు హైదరాబాద్ లో తనిఖీలు చేస్తున్నారు. ఏ కారణం లేకుండానే రోడ్డు మీదకు వచ్చిన
వాహనాలను సీజ్ చేస్తున్నారు. తన స్నేహతుడు ఫ్రిజ్ ఇస్తే..మంచిర్యాల ఏసీపీ కార్ పాస్ ఇచ్చారని చెప్పాడు. అదే తరహాలో తనకూ కార్ పాస్ ఇవ్వాలని ఏకంగా రాచకొండ కమీషనర్ ను కోరాడు.

విషయం తెలుసుకున్న పోలీసులు కారును స్వాధీనం చేసుకున్నారు. ఏసీపీ లక్ష్మీనారాయణను డీజీపీ కార్యలయానికి అటాచ్ చేస్తూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఏసీపీపై పోలీసు ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నారు. కారు పాస్ ఇచ్చేందుకు రిఫ్రిజిరేటర్ బహుమతిగా తీసుకున్నట్లు విచారణలో బయటపడినట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.