పేదలకు..సాయం చేసే విధానం ఇదేనా : ప్రచారం కోసం అత్యుత్సాహం

పేదలకు..సాయం చేసే విధానం ఇదేనా : ప్రచారం కోసం అత్యుత్సాహం

సహాయం చేయాల్సి ఉంటే..ఎలా చేస్తారు ? ఆ ఏముంది..ఎవరైతే ఇబ్బందుల్లో ఉంటారో..వారి వద్దకు వెళ్లి తమకు తోచిన విధంగా సహాయం చేసి వస్తాం..అంతే కదా..అంటారు కదా..కానీ కొంతమంది తమ రూటే సపరేటు అంటుంటారు. దీనిని క్యాష్ చేసుకోవాలని..పబ్లిసిటీ సంపాదించుకోవాలని ప్రయత్నిస్తుంటారు. ఇలా చేయడం మంచి పద్ధతి కాదని వారికి తెలుసు..

అయినా ఇలాంటి దారిని ఎంచుకుంటూ..ఎంతో మందికి ఇబ్బందులు కలుగ చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా కరోనా వ్యాపిస్తున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ లోకి వెళ్లిపోయింది. తినడానికి తిండి లేక ఏంతో మంది పేదలు అలమటిస్తున్నారు. వీరికి సహాయం చేసేందుకు ప్రభుత్వాలు పలు చర్యలు తీసుకుంటున్నాయి. మేము సైతం అంటూ కొన్ని స్వచ్చంద సంస్థలు ముందుకొచ్చి తోచిన విధంగా సహాయం అందిస్తున్నాయి.

ఇక్కడ కొన్ని స్వచంద సంస్థలు, కొంతమంది వ్యక్తులు సొంత ప్రచారానికి వాడుకుంటున్నారు. ఆర్బాటంగా ప్రచారం నిర్వహిస్తూ..లాక్ డౌన్ నిబంధనలనకు తూట్లు పొడుస్తున్నారు. ఆయా కేంద్రాలకు జనాలు ఎగబడుతున్నారు. ఇలాంటి ఘటనే గ్రేటర్ హైదరాబాద్ లో చోటు చేసుకుంది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో స్వచ్చంద సంస్థ నిర్వాకులు అత్యుత్సాహం నిర్వహించారు.

GHMC కరోనా వారియర్స్ కు పట్టుబట్టలు, పౌష్టికాహారం పంపిణీ చేస్తున్నామంటూ ప్రచారం జరిగింది. ఎగ్స్, బట్టలు, పండ్లు పంపిణీ చేస్తున్నట్లు కోవిడ్ సహృదయ ఫౌండేషన్ వెల్లడించింది. 2020, ఏప్రిల్ 18వ తేదీ శనివారం సన్మానం కార్యక్రమం చేస్తున్నామనడంతో భారీగా పారిశుధ్య కార్మికులు చేరుకున్నారు. ఒకరునొకరు తోసుకున్నారు. దీంతో పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది. లాఠీలకు పని చెప్పారు.

చివరకు పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఏదైనా పేదలకు సహాయం చేయాలని అనుకొంటే..ఇలా చేస్తారా ? కనీసం సరియైన ఏర్పాట్లు చేయరా అంటూ అక్కడికి వచ్చిన వారు మండిపడ్డారు. సాయం చేయాలని అనుకొంటే..సరియైన విధంగా చేయండి..ప్రచారాన్ని మానించుకొండని పలువురు సూచిస్తున్నారు.

Also Read | స్విట్జర్లాండ్ మంచుకొండ ఆసాంతం త్రివర్ణ పతాకం