Road accident: తెలుగు రాష్ట్రాల్లో వేరువేరు ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు.. 10మంది మృతి..

ఏపీ, తెలంగాణలో ఆదివారం ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ ప్రమాదాల్లో పది మంది మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. తెలంగాణలో నాలుగు జిల్లాల్లో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి...

Road accident: తెలుగు రాష్ట్రాల్లో వేరువేరు ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు.. 10మంది మృతి..

Accident

Road accident: ఏపీ, తెలంగాణలో ఆదివారం ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ ప్రమాదాల్లో పది మంది మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. తెలంగాణలో నాలుగు జిల్లాల్లో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ ప్రమాదాల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని టేకులపల్లి మండలం దాస్‌తండా సమీపంలో బైక్‌ను బొగ్గు లారీ ఢీకొట్టింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతులను ఎర్రాయిగూడెంకు చెందిన హనుమంతు, ఈసం స్వామిగా గుర్తించారు.

Accident: ఫుట్‌పాత్ పై నిద్రిస్తున్న వలస కూలీలపైకి దూసుకెళ్లిన లారీ..

మేడ్చల్‌ జిల్లా సూరారం వద్ద కోళ్ల లోడుతో వెళ్తున్న డీసీఎంను లారీ ఢీకొట్టింది. దీంతో డీసీఎం డ్రైవర్‌ మరణించాడు. డీసీఎం అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు వెల్లడించారు. మరోవైపు వరంగల్‌లోని ఖమ్మం బైపాస్‌ హంటర్‌ రోడ్డు ఫ్లై ఓవర్‌పై రెండు కార్లు ఢీకొన్నాయి. దీంతో ఫ్లైపైనుంచి ఓ కారు కిందపడిపోయింది. దీంతో ఒకరు ఘటనా స్థలంలోనే మృతిచెందగా, మరొకరు దవాఖానలో మరణించారు. ఈ ప్రమాదంలో మరో వ్యక్తి గాయపడ్డారు. అతడిని పోలీసులు ఎంజీఎం దవాఖానకు తరలించారు. మృతిచెందిన వారిని ఖమ్మం జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉద్యోగి సారయ్య, ఆయన భార్య సుజాతగా గుర్తించారు.

Road Accident : బాలకృష్ణ ఇంటి గేటుని ఢీ కొట్టిన జీపు.. తృటిలో తప్పిన ప్రమాదం..

ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్సార్‌ జిల్లా తాడిపత్రిలో ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట వద్ద రహదారిపై లారీని ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు ఢీకొట్టింది. దీంతో నలుగురుకి గాయాలయ్యాయి. అన్నమయ్య జిల్లా సందేపల్లి మండలంలో రెండు బైక్‌లు ఢీకొనడంతో ఈ ఘటనలో ఇద్దరు మృత్యువాతపడ్డారు. ఇలా ఆదివారం తెల్లవారు జాము నుంచి ఉదయం 10గంటల వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన పలు రోడ్డు ప్రమాదాల్లో పది మంది మృతిచెందారు.