100 positive cases in village : ఊరికి లాక్ డౌన్..ఒకేరోజు 100మందికి కరోనా..మూడు మరణాలు

100 positive cases in village : ఊరికి లాక్ డౌన్..ఒకేరోజు 100మందికి కరోనా..మూడు మరణాలు

100 Corona Positive Cases Reported In Gollapally Village

100 corona positive cases in gollapally village  : తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ మామూలుగా లేదు. దీంతో కేసులు తగ్గించటానికి కర్ఫ్యూ విధించింది.రాత్రి 9గంటల నుంచి ఉదయం 5గంటల వరకు కర్ఫ్యూ విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. కేంద్రం ఇప్పటికే కఠిన ఆంక్షలు అమలు చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. ఇదిలా ఉండగా తెలంగాణాలోని రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలోని గొల్లపల్లి గ్రామంలో ఒకేరోజు 100 మంది కరోనా బారినపడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

ఇదే గ్రామంలో గడిచిన 24గంటల్లో కరోనా బారిన పడి ముగ్గురు మృతి చెందారు. దీంతో గ్రామస్తులంతా హడలిపోతున్నారు. ఎప్పుడు ఎటువంటి చావు వార్త వినాల్సి వస్తుందోనని భయాందోళనలకు గురవుతున్నారు. ఒకేరోజు 100 కరోనా కేసులు నమోదు కావటంతో గ్రామం కరోనా కోరల్లో చిక్కుకున్నట్లుగా ఉంది. దీంతో కరోనా కట్టడికి స్వచ్చంద లాక్‌డౌన్ విధించారు.

కేవలం నిత్యావసర సరుకుల కోసం ఉదయం రెండు గంటలు,సాయంత్రం 2గంటలు షాపులు తెరుస్తారు. ఆ సమయంలో కావాల్సిన వస్తువులు తెచ్చుకుని జనాలందరూ ఇళ్లకే పరిమితమవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ నిబంధనలు అతిక్రమించి బయట తిరిగేవారికి రూ.1,000 జరిమానా తప్పదని కౌన్సిలర్ చెన్నం అశోక్ హెచ్చరించారు. నిత్యావసర సరుకుల కోసం బయటకొచ్చేవారు తప్పనిసరిగా ముఖానికి మాస్కు ధరించాలని,భౌతిక దూరం పాటించాలని సూచించారు.

కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం రాత్రిపూట కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే.రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉండనుంది. కేవలం అత్యవసర సర్వీసులకు మాత్రమే కర్ఫ్యూ నుంచి మినహాయింపునిచ్చారు. కాబట్టి ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసారు అధికారులు. అన్ని కార్యాలయాలు, సంస్థలు, దుకాణాలు, వ్యాపారాలు, బార్లు,రెస్టారెంట్లు రాత్రి 8 గంటలకే మూసివేయాలని జీవోలో పేర్కొంది.ఏప్రిల్ 30 వరకు కర్ఫ్యూ కొనసాగనుంది.