Ambulance : ఆగిన చంటిబిడ్డ గుండె..ఆయువునిచ్చిన 108 సిబ్బంది

చనిపోయిందనుకున్న చంటిబిడ్డకు ప్రాణం పోశారు అంబులెన్స్ సిబ్బంది. మూడు రోజుల పసిబిడ్డను 108 లో హాస్పిటల్ కు తీసుకెళుతున్న ఓ పసిబిడ్డకు గుండె కొట్టుకోవటం ఆగిపోయింది. దీంతో అంబులెన్స్ సిబ్బంది ఆగిపోయిన ఆ చిట్టి గుండెకు ఆయువు పోసారు. తిరిగి గుండె కొట్టుకునేలా చేశారు.

Ambulance : ఆగిన చంటిబిడ్డ గుండె..ఆయువునిచ్చిన 108 సిబ్బంది

Ambulance

Three Days Body Heartbeat by CPR : చనిపోయిందనుకున్న చంటిబిడ్డకు ప్రాణం పోశారు అంబులెన్స్ సిబ్బంది. మూడు రోజుల పసిబిడ్డను 108 లో హాస్పిటల్ కు తీసుకెళుతున్న ఓ పసిబిడ్డకు హఠాత్తుగా గుండె కొట్టుకోవటం ఆగిపోయింది. దీంతో కన్నతల్లి ఘొల్లుమని ఏడ్చింది. పుట్టి పట్టుమని పదిరోజులు కూడా కాకుండానే బిడ్డకు నూరేళ్లు నిండిపోయాయని గుండెలవిసేలా ఏడ్చింది. దీంతో అంబులెన్స్ సిబ్బంది ఆగిపోయిన ఆ చిట్టి గుండెకు ఆయువు పోసారు. తిరిగి గుండె కొట్టుకునేలా చేశారు. దీంతో ఆ తల్లి మనస్సు కుదుటపడింది. బిడ్డను గుండెలకు హత్తుకుంది. అంబులెన్స్ సిబ్బందికి నా బిడ్డను బతికించారయ్యా..ధన్యవాదాలు తెలిపింది.

తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లి జిల్లా మంథని మండటం గంగిపల్లికి చెందిన సుజాత అనే మహిళ మూడు రోజుల క్రితం బిడ్డకు జన్మనిచ్చింది. కాని పుట్టిన కాసేపటికే బిడ్డ అనారోగ్యానికి గురి కావటంతో కరీంనగర్ లోని ఆసుపత్రిలో జాయిన్ చేశారు.కానీ పరిస్థితి విషమించటంతో మెరుగైన చికిత్స కోసం వరంగల్ లోని మరో ఆసుపత్రికి అంబులెన్స్ లో తరలిస్తుండగా మార్గ మధ్యలో ఆ చంటిబిడ్డ గుండె కొట్టుకోవటం ఆగిపోయింది.

దీంతో 108 సిబ్బంది బిడ్డను బతకించటానికి బిడ్డకు వెంటనే సీపీఆర్ చేసి గుండె కొట్టుకునేలా చేశారు. ఆ వెంటనే బిడ్డకు గుండె తిరిగి కొట్టుకోవటం ప్రారంభించింది. తరువాత అంబులెన్స్ లోనే వైద్యం అందించిన సిబ్బంది వరంగల్ లోని ఓ ఆసుపత్రికి తరలించారు. బిడ్డ సురక్షితంగా ఉండటంతో తల్లీ సంతోషించింది. బిడ్డను బతికించిన అంబులెన్స్ సిబ్బందిని బిడ్డ తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలుపగా..గ్రామస్తులు అభినందించారు.