కరోనా భయం: పదోతరగతి పరీక్షలు వాయిదా

  • Published By: veegamteam ,Published On : March 20, 2020 / 09:19 AM IST
కరోనా భయం: పదోతరగతి పరీక్షలు వాయిదా

కరోనా భయంతో ప్రపంచమంతా అతలాకుతలం అవుతోంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు వాయిదా వేయాలని హైకోర్టు ఆదేశించింది. రేపు (మార్చి 21, 2020)న జరిగే పరీక్ష మాత్రం యథావిధిగా నిర్వహించాలని సూచించింది. మార్చి 23 నుంచి 30 వరకు జరగాల్సిన పరీక్షలు వాయిదా వేసి రీ షెడ్యూల్ చేయాలని ఆదేశించింది. తిరిగి మార్చి 30 నుంచి ఏప్రిల్ 6వ తేది వరకు జరగాల్సిన పరీక్షలపై తదితర నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. 

పరీక్షలు గురువారం(మార్చి 19, 2020)న ప్రారంభం అయ్యాయి. దీని కోసం దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 2530 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో విద్యార్థులంతా ఒకేసారి రాకుండా,గుంపులు గుంపులుగా ఉండకుండా చర్యలు చేపట్టారు. పరీక్షా కేంద్రాల వద్ద లిక్విడ్ హ్యాండ్ వాష్‌లను కూడా సిద్ధం చేశారు.  ఒకవేళ ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతుంటే వారి కోసం ప్ర్యతేక గదుల్ని కూడా ఏర్పాటు చేశారు.

కానీ, కరోనా రోజురోజుకి వ్యాప్తి చేందడంతో పరీక్షలు జరపటం అంత మంచిది కాదని నిర్ణయం తీసుకున్నారు. పిల్లల ఆరోగ్యం కన్నా పరీక్షలు ముఖ్యం కాదని.. ప్రపంచవ్యాప్తంగా కరోనా వణికిస్తున్న తరుణంలో పరీక్షలు కొనసాగించడం మంచిది కాదని న్యాయవాది పవన కుమారు వాదించాగా.. న్యాయస్థారం సోమవారం నుంచి పరీక్షలు వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

See Also | కరోనా ఎఫెక్ట్ : ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీ మరోసారి వాయిదా