హైకోర్టు ఆదేశాల మేరకు టెన్త్‌ పరీక్షలు

  • Published By: vamsi ,Published On : May 5, 2020 / 05:15 PM IST
హైకోర్టు ఆదేశాల మేరకు టెన్త్‌ పరీక్షలు

క్యాబినెట్ సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో మాట్లాడిన కేసిఆర్.. హైకోర్టు నిబంధనల మేరకు టెన్త్‌ పరీక్షలు నిర్వహిస్తామని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. పరీక్ష కేంద్రాలు పెంచి టెన్త్‌ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. 

భౌతికదూరం పాటిస్తూ, పరీక్షా హాళ్లను శానిటైజ్‌ చేస్తూ అన్ని జాగ్రత్తలు పాటిస్తూ టెన్త్‌ పరీక్షలు నిర్వహిస్తామని అన్నారు. ఈ నెలలోనే టెన్త్‌ పరీక్షలు పూర్తి చేస్తామని తెలిపారు. ఇంటర్‌ స్పాట్‌ వాల్యుయేషన్‌ రేపటి(మే 6) నుంచి ప్రారంభం అవుతుందని కేసీఆర్ వెల్లడించారు.

ఇక జోన్‌లతో సంబంధం లేకుండా అన్ని జిల్లాల్లో మే 29 వరకూ రాష్ట్రవ్యాప్తంగా రాత్రి 7 నుంచి ఉదయం 6 వరకు కర్ఫ్యూ సాగించాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అయితే గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్‌లలో మాత్రం కొన్ని సడలింపులు ఇస్తున్నట్లు ప్రకటించారు. మండల కేంద్రం, రూరల్‌ ప్రాంతాల్లో అన్ని షాపులకు అనుమతి ఇస్తున్నట్లు చెప్పారు.