Telangana 10th Exams: 24 నుంచి ఆన్‌లైన్‌లో పదో తరగతి హాల్ టిక్కెట్లు.. పరీక్షలపై మంత్రి సమీక్ష

పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి 13వ తేదీ వరకు జరుగుతాయి. రోజూ ఉదయం 09.30 గంటల నుంచి 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టిక్కెట్లు ఈ నెల 24 నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. తెలంగాణవ్యాప్తంగా 4,94,616 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయబోతున్నారు.

Telangana 10th Exams: తెలంగాణలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టిక్కెట్లు ఈ నెల 24 నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. పదో తరగతి పరీక్షలపై తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శనివారం సమీక్ష నిర్వహించారు.

Heavy Rains: తెలుగు రాష్ట్రాల్లో భారీ వానలు… పలు చోట్ల వడగళ్ల వర్షం.. మరో రెండు రోజులు వానలే!

ఈ సందర్భంగా అధికారులకు అనేక సూచనలు చేశారు. పరీక్షల్ని పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. మంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం.. పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి 13వ తేదీ వరకు జరుగుతాయి. రోజూ ఉదయం 09.30 గంటల నుంచి 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. అన్ని పరీక్షలు మూడు గంటలు జరిగితే, సైన్స్ పరీక్ష మాత్రం మూడు గంటల ఇరవై నిమిషాలు జరుగుతుంది. పదో తరగతి హాల్ టిక్కెట్లు ఈ నెల 24 నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. పాఠశాలలకు కూడా హాల్ టిక్కెట్లు పంపుతారు. గతంలోలాగా కాకుండా ఈ సారి ఆరు పేపర్లతోనే పరీక్షలు నిర్వహించబోతున్నారు.

MLC Elections: పట్టభద్రుల ఎన్నికల్లో నైతిక విజయం వైఎస్సార్‌సీపీదే.. కౌంటింగ్ అక్రమాలపై కోర్టుకు వెళ్తాం: వైఎస్సార్‌సీపీ అభ్యర్థి రవీంద్రా రెడ్డి

తొమ్మిదో తరగతి పరీక్షల్ని కూడా ఈ ఏడాది నుంచి ఇదే పద్ధతిలో నిర్వహిస్తున్నారు. తెలంగాణవ్యాప్తంగా 4,94,616 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయబోతున్నారు. ఈ పరీక్షల కోసం 2,652 కేంద్రాల్ని ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తారు. విద్యార్థులకు పరీక్షల సందర్భంగా ఎలాంటి ఆటంకం కలగకుండా ఏర్పాట్లు చేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. ప్రస్తుతం విద్యాశాఖకు చెందిన ఉన్నతాధికారులతోనే సమీక్ష నిర్వహించగా, త్వరలో డీఈవోలు, కలెక్టర్లు, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించబోతున్నారు.

ట్రెండింగ్ వార్తలు