Telangana RTC : సార్..మా ఊరికి బస్సు వేయించండి…చీఫ్ జస్టిస్‌కు విద్యార్థిని ఉత్తరం

సార్..మా ఊరికి బస్సు వేయించండి అంటూ...భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు ఎనిమిదో తరగతి విద్యార్థిని ఉత్తరం రాసింది.

Telangana RTC : సార్..మా ఊరికి బస్సు వేయించండి…చీఫ్ జస్టిస్‌కు విద్యార్థిని ఉత్తరం

Rtc

Chief Justice Ramana : సార్..మా ఊరికి బస్సు వేయించండి అంటూ…భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు ఎనిమిదో తరగతి విద్యార్థిని ఉత్తరం రాసింది. వెంటనే దీనిపై ఆయన స్పందించారు. చర్యలు తీసుకోవాల్సిందిగా…ఆర్టీసీ అధికారులకు లేఖ రాశారు. దీనిపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. ఆ గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించారు. తమ గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించినందుకు…అధికారులకు విద్యార్థిని కృతజ్ఞతలు తెలిపింది. రంగారెడ్డి జిల్లా మాచారం మండలం చిదేడు గ్రామంలో వైష్ణవి 8వ తరగతి చదువుతోంది. కరోనా వైరస్ కారణంగా…స్కూళ్లు మూతపడిన సంగతి తెలిసేందే. కొన్ని గ్రామాలకు బస్సులు నిలిచిపోయాయి.

Read More : Aliya Bhat : జీవితాంతం తండ్రి సంపాదించిన డబ్బును రెండేళ్లలో సంపాదించిన స్టార్ హీరోయిన్

ప్రస్తుతం వైరస్ కట్టడి కావడంతో నిబంధనలు, ఆంక్షలను సడలించారు. కానీ…లాక్ డౌన్ ముగిసిన తర్వాత..పలు గ్రామాలకు బస్సు సౌకర్యం అందలేదు. అందులో చిదేడు గ్రామం కూడా ఉంది. స్కూలుకు వెళ్లడానికి బస్సు సౌకర్యం లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతోంది. దీంతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు ఉత్తరం రాసింది. కరోనా మొదటి దశలో ఉండగా..తన తండ్రి చనిపోయారని, తల్లి..చిన్న ఉద్యోగం చేసుకుంటూ..కుటుంబాన్ని పోషిస్తోందని తెలిపింది. చిదేడు గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని లేఖలో విజ్ఞప్తి చేసింది. దీనిపై జస్టిస్ రమణ స్పందించారు. వెంటనే చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఆర్టీసీ అధికారులకు సూచించారు.

Read More : T20 World Cup 2021 ఎట్టకేలకు భారత్ బోణీ.. అప్ఘానిస్తాన్ పై ఘన విజయం

ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. చిదేడు గ్రామానికి బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. తమ గ్రామానికి బస్సు సౌకర్యం అవసరం ఉన్న విషయాన్ని వైష్ణవి..ధైర్యంగా వెలుగులోకి తీసుకరావడం అభినందనీయమని, గ్రామాల్లో నెలకొన్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి…పరిష్కారానికి కృషి చేయాలని సజ్జనార్ సూచించారు. తమ బాధలను చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకు తెలియచేసే ప్రయత్నం చేశామని, తమ గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించినందుకు వైష్ణవి..ఇతరులు ధన్యవాదాలు తెలియచేశారు.