Telangana : హైదరాబాద్ లో 13 ఏళ్ల బాలుడు మిస్సింగ్..ఆందోళనలో తల్లిదండ్రులు

హైదరాబాద్ లోని చందానగర్ లో 13 ఏళ్ల బాలుడు కనిపించకుండాపోయాడు. దీంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

Telangana : హైదరాబాద్ లో 13 ఏళ్ల బాలుడు మిస్సింగ్..ఆందోళనలో తల్లిదండ్రులు

13 Years Boy Missing

13 years boy missing in chandanagar hyderabad  : దేశ వ్యాప్తంగా పలు నగరంలో చిన్నారుల అదృశ్యం కలకలం రేపుతోంది. ఈక్రమంలో హైదరాబాద్ నగరంలో 13 ఏళ్ల బాలుడు కనిపించకుండాపోయాడు. దీంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. 13 ఏళ్ల బాలుడు మిస్సింగ్ చందానగర్‌లో తీవ్ర కలకలం సృష్టిస్తోంది. సోమవారం (నవంబర్ 8,2021) ఉదయం అక్షిత్ అనే 13 ఏళ్ల బాలుడు కనిపించకుండాపోయాడు. అక్షిత్‌.. మిస్అయి 24 గంటలు గడుస్తున్నా ఇప్పటికీ ఆచూకీ లభించలేదు. దీంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అక్షిత్‌ మిస్సింగ్‌పై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కానీ ఇప్పటివరకు ఎటువంటి ఆచూకీ లభించలేదు.

Read more : Hyderabad Crime : స్నేహితుడి భార్యపై అఘాయిత్యం.. వీడియోలు తీసి వెకిలి చేష్టలు

నిన్నటి నుంచి కొడుకు కనిపించకపోవడంతో అక్షిత్ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. బాలుడి కోసం గాలిస్తున్నారు. ఓ పక్క బంధువులు, మరోపక్క పోలీసులు 24 గంటలుగా గాలిస్తున్నా పసివాడి జాడ లభించకపోవడంతో ఆందోళన మరింత పెరుగుతోంది. అక్షిత్‌‌ ఏమయ్యాడో..ఎక్కడున్నాడో..ఎలా ఉన్నాడో అని ఆందోళన పడుతున్నారు. నాబిడ్డను ఎక్కడున్నా తెచ్చి ఇవ్వాలని తెలిసినవారినందరిని వేడుకుంటున్నారు.

Read more : Ganja Seized : హైదరాబాద్‌లో రౌడీ షీటర్ అరెస్ట్-2 కిలోల గంజాయి స్వాధీనం