Traffic Challan On Bike : ఒకే బైక్‌పై 139 చలానాలు..రూ.54,195 జరిమానా

రంగారెడ్డి జిల్లా నార్సింగ్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని సబితా నగర్‌ చౌరాస్తాలో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ చేపట్టిన పోలీసులు.. ఓ బైక్‌పై 139 చలాన్లు ఉండడాన్ని గమనించి కంగుతిన్నారు.

Traffic Challan On Bike : ఒకే బైక్‌పై 139 చలానాలు..రూ.54,195 జరిమానా

Chalana

Traffic Challan On Bike: పోలీసులు ట్రాఫిక్‌ నిబంధనలు ఎంత కఠినంగా అమలు చేస్తున్నా.. ఉల్లంఘనలు కూడా అదే స్థాయిలో జరిగిపోతున్నాయి. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీల్లో ఈ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా నార్సింగ్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని సబితా నగర్‌ చౌరాస్తాలో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ చేపట్టిన పోలీసులు.. సమీర్‌కు చెందిన బైక్‌పై 139 చలాన్లు ఉండడాన్ని గమనించి కంగుతిన్నారు.

ఆ బైక్‌పై 54 వేల 195 రూపాయల ఫైన్‌ పెండింగ్‌లో ఉంది. జరిమానా మొత్తం చెల్లించి వాహనం తీసుకెళ్లాలని పోలీసులు చెప్పడంతో వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేశాడు. పోలీసులు అంగీకరించక పోవడంతో 25 చలాన్లపై ఉన్న ఫైన్‌ కట్టి.. మిగిలిన మొత్తం చెల్లిస్తానని హామీ ఇచ్చి బైక్‌ తీసుకెళ్లాడు.

Vaccination Of Children : సరైన శిక్షణ పొందిన వారితో మాత్రమే పిల్లలకు కోవిడ్ టీకాలు వేయించాలి : కేంద్ర ఆరోగ్యశాఖ

గతంలో చలానాలు కట్టలేక బైక్ లను దగ్ధం చేయడం, బైక్ లను వదిలిపెట్టిపోయిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. వికారాబాద్ లో వరుసగా వస్తున్న ట్రాఫిక్ చలానాలు భరించలేక యువకుడు బైక్ పై పెట్రోలో పోసి నిప్పంటించాడు. హైదరాబాద్ లో తన బైక్ పై పోలీసులు విధించిన చాలానాలు కట్టే బదలు కొత్త బైక్ కొనుక్కోవచ్చనుకున్న ఒక వాహనదారుడు తన బైక్ వదిలి పరారయ్యాడు.

హైదరాబాద్ అంబర్ పేట్ అలీ కేఫ్ చౌరస్తా‌లో కాచిగూడ ట్రాఫిక్ పోలీసులు రాత్రి వాహనాలు తనిఖీలు చేస్తున్నారు. ఆ సమయంలో హీరో హోండా ప్యాషన్ బైక్‌పై వచ్చిన వాహనదారుడు పోలీసులను చూసి బైక్ వదిలి పారిపోయాడు.