Deputy Collectors : తెలంగాణలో 16 మంది తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా ప్రమోషన్

డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి పొందిన తహసీల్దార్లు, సెక్షన్ ఆఫీసర్లు సంతోషం వ్యక్తం చేశారు.ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Deputy Collectors : తెలంగాణలో 16 మంది తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా ప్రమోషన్

Tahasildars promoted

Tahasildars promoted : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి వేడుకల వేళ పలువురు తహసీల్దార్లు, సెక్షన్ ఆఫీసర్లకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. 16 మంది తహసీల్దార్లు, ఇద్దరు సెక్షన్ ఆఫీసర్లు, ఒక సీసీఎల్ఏ ఆఫీసర్ కు డిప్యూటీ కలెక్టర్లుగా ప్రమోషన్ కల్పించింది.

ఈ మేరకు శనివారం రాష్ట్ర రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి పొందిన తహసీల్దార్లు, సెక్షన్ ఆఫీసర్లు సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

కే మహేశ్వర్(తహసీల్దార్), ఎం సూర్యప్రకాశ్ (తహసీల్దార్), మురళీ కృష్ణ (తహసీల్దార్), కే మాధవి, పీ.నాగరాజు (సెక్షన్ ఆఫీసర్), ఎల్ అలివేలు (తహసీల్దార్), బీ శంకుతల(తహసీల్దార్),
కే సత్యపాల్ రెడ్డి (తహసీల్దార్), పీ మాధవి దేవీ (సీసీఎల్ఏ ఆఫీసర్), వీ సుహాషినీ (తహసీల్దార్) పదోన్నతి పొందారు.

TSPSC Group-1 : జూన్ 11న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష

భూక్యా బన్సీలాల్ (తహసీల్దార్), బీ జయశ్రీ (తహసీల్దార్), ఎం శ్రీనివాస్ రావు(తహసీల్దార్),
డీ దేవుజ(తహసీల్దార్), డీ ప్రేమ్ రాజ్ (తహసీల్దార్), ఐవీ భాస్కర్ కుమార్ (సెక్షన్ ఆఫీసర్), ఉప్పల లావణ్య, డి చంద్రకళ (తహసీల్దార్), ఆర్ వీ రాధాబాయి(తహసీల్దార్) ప్రమోషన్ పొందారు.