Swachh Sarvekshan Awards : తెలంగాణకు 16 స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డులు

స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డుల్లో తెలంగాణ రెండోస్థానంలో నిలిచింది. స్వచ్ఛ సర్వేక్షణ్‌-2022 అవార్డులను కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ ఇటీవల ప్రకటించగా.. రాష్ట్రంలోని 16 పట్టణ స్థానిక సంస్థలను అవార్డులు వరించాయి. అక్టోబర్‌ 2న మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా.. శనివారం (అక్టోబర్ 1,2022) న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులను ప్రదానం చేశారు.

Swachh Sarvekshan Awards : తెలంగాణకు 16 స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డులు

Swachh Sarvekshan awards (1)

Swachh Sarvekshan Awards : స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డుల్లో తెలంగాణ రెండోస్థానంలో నిలిచింది. స్వచ్ఛ సర్వేక్షణ్‌-2022 అవార్డులను కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ ఇటీవల ప్రకటించగా.. రాష్ట్రంలోని 16 పట్టణ స్థానిక సంస్థలను అవార్డులు వరించాయి. అక్టోబర్‌ 2న మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా శనివారం (అక్టోబర్ 1,2022) న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులను ప్రదానం చేశారు. ఆయా అవార్డులను రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌తో పాటు ఆయా పట్టణాల చైర్మన్లు, చైర్‌పర్సన్స్‌ అవార్డులను అందుకున్నారు.

తెలంగాణ నుంచి కోరుట్ల మున్సిపాలిటీకి లభించిన స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డును కేంద్ర మంత్రి కౌషల్‌ కిశోర్‌ నుంచి మంత్రి కేటీఆర్‌ సమక్షంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అన్నం లావణ్య, కమిషనర్‌ అయాజ్‌ అందుకున్నారు. తెలంగాణకు అవార్డులు దక్కడంపై మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌కు పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌ కృతజ్ఞతలు తెలిపారు. అర్బన్‌ స్వచ్ఛ సర్వేక్షణ్‌లో రాష్ట్రం 16 అవార్డులతో రెండోస్థానంలో నిలిచిందని, మార్గనిర్దేశనం చేస్తూ, పర్యవేక్షించిన మంత్రి కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.

Cleanest Cities: అతి శుభ్రమైన నగరాల్లో ర్యాంకులు సాధించిన బెజవాడ, వైజాగ్

దేశవ్యాప్తంగా 4,355 స్థానిక సంస్థల్లో స్వచ్ఛ సర్వేక్షణ్‌ కార్యక్రమాన్ని చేపట్టగా.. ఇందులో తెలంగాణలోని 16 మున్సిపాలిటీలు సత్తా చాటి..అవార్డులను సాధించాయి. మొత్తం 90 అంశాలను ప్రాతిపదికన తీసుకుని అవార్డులకు ఎంపిక చేశారు. సాలిడ్ వెస్ట్ మేనేజ్‌మెంట్, లిట్టర్ ఫ్రీ వాణిజ్య ప్రాంతాలు, కమ్యూనిటీ లెవల్ కంపోస్టింగ్, ప్రజా మరుగుదొడ్లు వంటి అంశాల వారీగా అవార్డులను ఎంపిక చేశారు. అవార్డులు సాధించిన మున్సిపాలిటీల్లో ఆది బట్ల, బడంగ్‌పేట్, భూత్‌పూర్, చండూర్, చిట్యాల, గజ్వేల్, ఘట్ కేసర్, హుస్నాబాద్, కొంపల్లి, కోరుట్ల, కొత్తపల్లి, నేరుడుచర్ల, సికింద్రాబాద్, సిరిసిల్ల, తుర్కయాంజల్, వేములవాడ ఉన్నాయి.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.