తెలంగాణలో కొత్తగా 178 కరోనా కేసులు..ఆరుగురు మృతి

  • Published By: bheemraj ,Published On : June 9, 2020 / 05:18 PM IST
తెలంగాణలో కొత్తగా 178 కరోనా కేసులు..ఆరుగురు మృతి

తెలంగాణలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. రాష్ట్రంలో కొత్తగా 178 కరోనా కేసులు నమోదవ్వగా ఆరుగురు మృతి చెందారు. తాజాగా జీహెచ్ఎంసీ పరిధిలో 143 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డిలో 15, మేడ్చల్ లో 10, మహబూబ్ నగర్ లో 2, సంగారెడ్డి లో 2 , మెదక్ 2, జగిత్యాల 1, ఆసిఫాబాద్ 1, సిరిసిల్ల 1, వరంగల్ రూరల్ జిల్లాలో ఒక్క కేసు నమోదు అయ్యింది. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3920 కాగా, తెలంగాణలో యాక్టివ్ కేసులు 2030 ఉన్నాయి.

రాష్ట్రంలో కరోనా కేసులు దాదాపు 4 వేలకు చేరువలో ఉన్నాయి. ఇందులో డిశ్చార్జి అవుతున్న వారి సంఖ్య కొంత తక్కువగా ఉంది. గత రెండు రోజుల క్రితం కూడా కొంత మందిని హోం క్వారంటైన్ చేశారు. మరికొంత మందిని నేచర్ క్యూర్ హాస్పిటల్ లో క్వారంటైన్ చేయించటానికి కూడా పంపించారు. 50 ఏళ్లకు లోబడి ఉన్నవారందరిని కూడా నేచర్ క్యూర్ హాస్పిటల్ లో క్వారంటైన్ చేయడానికి పంపించారు. 

మరోవైపు క్రిటికల్ గా ఉన్న వారిని, 50 ఏళ్లకు పైబడిన వారిని మాత్రమే గాంధీ  ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ చేస్తున్నారు. గాంధీ, నేచర్ క్యూర్ హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ పొందుతున్నారు. ఇవాళ కొంత మందిని డిశ్చార్జ్ చేశారు. దీంతో మొత్తం 1742 మందిని ఇప్పటి వరకు డిశ్చార్జ్ చేశారు. ఇవాళ కరోనాతో ఆరుగురు మృతి చెందారు. ఈ మేరకు మంగళవారం (జూన్ 9, 2020) రాష్ట్ర ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనాతో 148 మంది మృతి చెందారు.