తెలంగాణలో కొత్తగా 1,850 కరోనా కేసులు, ఐదుగురు మృతి

  • Published By: bheemraj ,Published On : July 4, 2020 / 11:22 PM IST
తెలంగాణలో కొత్తగా 1,850 కరోనా కేసులు, ఐదుగురు మృతి

తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనేవుంది. రోజురోజుకు కరోనా కేసులు, మరణాల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రంలో కొత్తగా 1,850 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. శనివారం (జులై 4, 2020)వ తేదీన మరో ఐదుగురు కరోనాతో మృతి చెందారు. తెలంగాణలో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 22,312 కు చేరింది. వైరస్ బారిన పడి 288 మ‌ృతి చెందారు.

శనివారం 1,342 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం 11,537 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో 10,487 యాక్టివ్ కేసులు ఉండగా, వారికి వివిధ ఆస్పత్రుల్లో
చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 1,10,545 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.
24 గంటల్లో 6,427 శాంపిల్స్ పరీక్షించగా 1,850 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి.

జీహెచ్ఎంసీ పరిధిలో 1,572 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. రంగారెడ్డి 92, మేడ్చల్ 53, వరంగల్ అర్బన్ 31, కరీంనగర్ 18 కేసులు, నిజమాబాద్ 17 కేసులు నమోదయ్యాయి. నల్లగొండ 10, సంగారెడ్డి 8, ఖమ్మం7, వరంగల్ రూరల్ లో 6 కేసులు, మహబూబ్ నగర్ 5, సిద్ధిపేట 5, జగిత్యాల 5 పాజిటివ్ కేసుల చొప్పున నమోదు అయ్యాయి. భూపాలపల్లి 4, సిరిసిల్ల 3, భద్రాద్రి 3, వికారాబాద్ 3, జనగామ 3, గద్వాల్ 2, నిర్మల్ 1, భువనగిరి1, మెదక్ 1 చొప్పున కేసులు నమోదయ్యాయి.