Omicron : ఒమిక్రాన్‌‌తో ఆందోళన వద్దు..భోజనం సమయంలోనే మాస్క్ తీయాలి – డీహెచ్

వ్యాక్సిన్ లు చాలా వరకు ఒమిక్రాన్ వేరియంట్ నుంచి కొంత వరకు ఉపయోపడుతున్నాయన్నారు. యూకే లో ఒమిక్రాన్ తో ఒక మరణం నమోదనట్లు వెల్లడైందన్నారు.

Omicron : ఒమిక్రాన్‌‌తో ఆందోళన వద్దు..భోజనం సమయంలోనే మాస్క్ తీయాలి – డీహెచ్

Omicron Tg

2 Omicron Cases in Hyderabad : ఒమిక్రాన్ తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించింది. హైదరాబాద్ లో ఏకంగా రెండు కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. స్వయంగా..ప్రజారోగ్య సంచాలకులు (డీహెచ్) శ్రీనివాసరావు ఈ విషయాన్ని వెల్లడించారు. 2021, డిసెంబర్ 15వ తేదీ బుధవారం ఉదయం మీడియాతో ఆయన మాట్లాడారు. సుమారు నెల రోజుల్లో 77 దేశాల్లో కొత్త వేరియంట్ వ్యాప్తి చెందిందన్నారు. భారత్ లో కర్ణాటక, ఢిల్లీ, గుజరాత్, ఎపి రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయన్నారు. కెన్యా కు చెందిన 24 ఏళ్ల మహిళ 12వ తేదీనన రాష్ట్రానికి వచ్చారన్నారు. ఆమెకు పరీక్షలు నిర్వహించగా…పాజిటివ్ గా నిర్ధారించామన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఇద్దరు ఒమిక్రాన్ బాధితులు ఉన్నారని, చాలా స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయన్నారు. ఈ విషయంలో ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

Read More : 2021 Most Searching Movies : ‘జై భీమ్’ మరో రికార్డ్.. 2021లో అత్యధికంగా వెతికిన సినిమాలు ఇవే..

అయితే ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఒమిక్రాన్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతోందని, రెండు రోజుల్లోనే డబుల్ అయ్యే సామర్థ్యం ఉందన్నారు. కొత్త వేరియంట్ ఎలా పని చేస్తుందో సరిగా చెప్పలేమనట్లు, నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చే వారికి టెస్టింగ్ ని పెంచుతామన్నారు. 50% మాస్క్ ల వినియోగం పెరిగినట్లు, ఒమిక్రాన్ వేరియంట్ ని సైతం కోవిడ్ నియమాలు పాటించి నియంత్రించవచ్చన్నారు.

Read More : Omicron : తెలంగాణలో ఒమిక్రాన్..హైదరాబాద్‌‌లో రెండు కేసులు

వ్యాక్సిన్ లు చాలా వరకు ఒమిక్రాన్ వేరియంట్ నుంచి కొంత వరకు ఉపయోపడుతున్నాయన్నారు. యూకే లో ఒమిక్రాన్ తో ఒక మరణం నమోదనట్లు వెల్లడైందన్నారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రి నుంచి ఒకరు పారిపోయారన్న వార్తల్లో వాస్తవం లేదని చెప్పారు. సోమాలియా నుంచి వచ్చిన వ్యక్తిని గుర్తించాల్సి ఉందన్నారు. ఇంట్లో బయటా ఎప్పుడు మాస్క్ ధరించాలని సూచించారు. కేవలం భోజనం చేసేప్పుడు మాత్రమే మాస్క్ తీయాలని ఎందుకంటే ఒమిక్రాన్ సైతం గాలి ద్వారా సోకుతుందని డీహెచ్ వెల్లడించారు.