Telangana: అమెరికాలో ఇద్దరు తెలంగాణ విద్యార్థుల మృతి.. చెరువులో మునిగి ఒకరు.. అతడిని రక్షించేందుకు వెళ్లి మరొకరు

అమెరికాలో వీకెండ్ సందర్భంగా సరదాగా ఈతకు వెళ్లిన తెలంగాణ యువకులు చెరువులో మునిగి ప్రాణాలు కోల్పోయారు. మృతులను ఉత్తేజ్ కుంట, శివ కెల్లిగారిగా గుర్తించారు.

Telangana: అమెరికాలో ఇద్దరు తెలంగాణ విద్యార్థుల మృతి.. చెరువులో మునిగి ఒకరు.. అతడిని రక్షించేందుకు వెళ్లి మరొకరు

Telangana: తెలంగాణకు చెందిన ఇద్దరు యువకులు అమెరికాలో ప్రాణాలు కోల్పోయారు. చెరువులో మునిగి ఒక యువకుడు ప్రాణాలు కోల్పోగా.. అతడిని రక్షించేందుకు ప్రయత్నించిన స్నేహితుడు కూడా మరణించాడు. ఈ ఘటన మిస్సౌరి రాష్ట్రం, లేక్ ఆఫ్ ఒజార్క్స్‌లో శనివారం మధ్యాహ్నం జరిగింది.

Delhi Murder: శ్రద్ధా తరహాలో మరో హత్య.. భర్త శవాన్ని పది ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో దాచిన భార్య

మృతులను ఉత్తేజ్ కుంట (24), శివ కెల్లిగారి (25)గా గుర్తించారు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. థాంక్స్ గివింగ్ వీకెండ్ సందర్భంగా స్నేహితులైన ఉత్తేజ్, శివ కలిసి ఇంటి సమీపంలోని చెరువుకు సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో ఈత కొడుతూ ఉత్తేజ్ నీట మునిగిపోయాడు. ఇది గమనించిన శివ చెరువులోకి దిగి అతడిని రక్షించేందుకు ప్రయత్నించాడు. అయితే, అతడు కూడా నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. ఆ సమయంలో వారి అరుపులు విన్న ఇంటి యజమాని వెంటనే ఎమర్జెన్సీ హెల్ప్ కోసం కాల్ చేశాడు. అలాగే తన సోదరుడితో కలిపి కయాక్ (పడవ) తెచ్చి వాళ్లను రక్షించేందుకు ప్రయత్నించాడు. ఆ లోపే ఇద్దరూ మునిగిపోయినట్లు వాళ్లు చెప్పారు. వెంటనే సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది రంగంలోకి దిగి సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు.

Ruturaj Gaikwad: ఒకే ఓవర్లో ఏడు సిక్సర్లు.. సరికొత్త చరిత్ర సృష్టించిన రుతురాజ్ గైక్వాడ్.. ట్రెండింగ్ వీడియో

రెండు గంటల తర్వాత ఉత్తేజ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆదివారం శివ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఘటన గురించి తెలుసుకున్న తెలంగాణ మంత్రి కేటీఆర్.. యువకుల మృతదేహాల్ని వీలైనంత త్వరగా ఇండియా తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. బాధితులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.