CM KCR : దళితబంధుకు వచ్చే బడ్జెట్‌లో రూ.20,000 కోట్లు

సీఎం కేసీఆర్ దళిత బంధుపై కీలక ప్రకటన చేశారు. వచ్చే బడ్జెట్‌లో దళితబంధు పథకానికి 20వేల కోట్లు ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు కేసీఆర్.

CM KCR : దళితబంధుకు వచ్చే బడ్జెట్‌లో రూ.20,000 కోట్లు

Cm Kcr

CM KCR :  సీఎం కేసీఆర్ దళిత బంధుపై కీలక ప్రకటన చేశారు. వచ్చే బడ్జెట్‌లో దళితబంధు పథకానికి 20వేల కోట్లు ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు కేసీఆర్. సోమవారం ప్రగతిభవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన దళిత బంధుపై మాట్లాడారు. వచ్చే ఏడాది మార్చి నాటికి హుజూరాబాద్‌లోని దళిత కుటుంబాలకు దళితబంధు అందిస్తామని తెలిపారు. ఇక బడ్జెట్‌లో పెట్టె 20 వేలకోట్లతో రాష్ట్రంలోని 2 లక్షల కుటుంబాలకు మేలుజరుగుతుందని కేసీఆర్ తెలిపారు.

చదవండి : CM KCR : బండి సంజయ్ నువ్వేమన్న ట్రాక్టర్ డ్రైవర్‌వా – కేసీఆర్

ఇదే సమయంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షడు బండి సంజయ్‌పై విమర్శలు గుప్పించారు.. ‘దళితబంధు గురించి మాట్లాడే తెలివి ఉందా నీ ముఖానికి? దళితబంధు ఏంటో? ఎట్ల? ఎందుకు పుట్టిందో తెలుసా?’ అంటూ బండి సంజయ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులు ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలనే లక్ష్యంతో ప్రపంచంలోనే ఎక్కడా లేనివిధంగా ఈ పథకాన్ని అమలుచేస్తున్నట్టు తెలిపారు. అంత హుందాతనం ఉంటే కేంద్రం రూ.20 వేల కోట్లు ఇస్తమని ముందుకు రావాలని వ్యాఖ్యలు చేశారు.

చదవండి : CM KCR : కేంద్రంపై జంగ్..! బండికి రివర్స్ కౌంటర్..!! కేసీఆర్ కౌంటర్ ప్రెస్‌మీట్ డే-2 స్పీచ్ హైలైట్స్ ఇవే