Minister ktr: 20ఏళ్లలో కేటీఆర్ ప్రధాని కావొచ్చు..! మహిళా వ్యాపారవేత్త ప్రశంసలు

తెలంగాణ ప్రభుత్వ పాలనలో ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ఐటీ మంత్రిగా కొనసాగుతూ పేరుపొందిన పెద్ద పెద్ద కంపెనీలు హైదరాబాద్ లో తమ బ్రాంచ్ లు ఏర్పాటు చేసేలా కృషి చేశారు. కంపెనీలకు కావాల్సిన వసతి సౌకర్యాలు కల్పిస్తూ హైదరాబాద్ లో...

Minister ktr: 20ఏళ్లలో కేటీఆర్ ప్రధాని కావొచ్చు..! మహిళా వ్యాపారవేత్త ప్రశంసలు

Ministar Ktr

Minister ktr: తెలంగాణ ప్రభుత్వ పాలనలో ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ఐటీ మంత్రిగా కొనసాగుతూ పేరుపొందిన పెద్ద పెద్ద కంపెనీలు హైదరాబాద్ లో తమ బ్రాంచ్ లు ఏర్పాటు చేసేలా కృషి చేశారు. కంపెనీలకు కావాల్సిన వసతి సౌకర్యాలు కల్పిస్తూ హైదరాబాద్ లో ప్రముఖ కంపెనీలు, పరిశ్రమలకు కేంద్రంగా మార్చేందుకు కేటీఆర్ విశేష కృషి చేస్తున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా దావోస్ వెళ్లిన మంత్రి కేటీఆర్ బిజీబిజీగా గడుపుతున్నారు. పెట్టుబడుల సదస్సులో తనదైన మార్క్ చూపిస్తూ దావోస్ లో కేటీఆర్ టీం స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుంది. రెండు రోజుల్లోనే పలు దిగ్గజ సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపించేలా కేటీఆర్ చర్చలు జరిపారు.

Ministar ktr: నేటి నుంచి మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటన.. ఎన్నిరోజులంటే..

కేటీఆర్ సూచనలతో పలు కంపెనీలు తెలంగాణలో తమ కార్యకలాపాలను కొనసాగించేందుకు సిద్ధమంటూ ప్రకటన చేశాయి. పలువురు వ్యాపారవేత్తలు దావోస్ మంత్రి కేటీఆర్ టీం వ్యవహారశైలిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. తాజాగా సిలికాని వ్యాలీకి చెందిన ప్రముఖ వెంచర్ క్యాపిటలిస్ట్, ఎంట్రప్రెన్యూర్‌ అశా జడేజా మోత్వాని తెలంగాణ మంత్రి కేటీఆర్ ను ఆకాశానికెత్తేశారు. తెలంగాణకు పెట్టుబడులు తీసుకువచ్చేందుకు కేటీఆర్ అద్భుతంగా కృషి చేస్తున్నారని ఆమె ట్వీట్ చేశారు. కేటీఆర్ పని తీరు సూపర్ అంటూ కొనియాడారు.

Ministar ktr: నేటి నుంచి మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటన.. ఎన్నిరోజులంటే..

కేటీఆర్ అంతటి విజన్ ఉన్న యువ పొలిటికల్ లీడన్ ను తానెప్పుడు చూడలేదని అశా జడేజా మోత్వాని పొగడ్తలతో ముంచెత్తారు. అన్ని అంశాలపై ఆయనకు పూర్తి అవగాహన, స్పష్టత ఉందన్నారు. 20 సంవత్సరాల తర్వాత భారతదేశానికి కేటీఆర్ ప్రధానమంత్రి అయినా ఆశ్చర్యం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దావోస్ లో కేటీఆర్ ను కలిసిన ఫోటోలను అశా జడేజా తన ట్విటర్ పోస్టులో షేర్ చేశారు. కేటీఆర్ భవిష్యత్ దేశ ప్రధాని అయినా అశ్చర్యం లేదంటూ ప్రముఖ వెంచర్ క్యాపిటలిస్ట్, ఎంట్రప్రెన్యూర్‌ అశా జడేజా చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. తెరాస శ్రేణులు అశా జడేజా మోత్వాని ట్వీట్ ను వైరల్ చేస్తున్నాయి. కేటీఆర్ పై ప్రశంసల జల్లు కురిపిస్తూ పలువురు రీ ట్వీట్లు చేస్తున్నారు.