Precautionary Dose: తెలంగాణలో 25లక్షల మందికి వ్యాక్సిన్ మూడో డోస్

ప్రధాని నరేంద్ర మోదీ 60ఏళ్లకు పైబడిన వ్యక్తుల్లో దేశవ్యాప్తంగా దాదాపు 3కోట్ల మందికి వ్యాక్సిన్ మూడో డోస్ వేయనున్నట్లు ప్రకటించారు. జనవరిలో చేపట్టనున్న ఈ ప్రక్రియలో తెలంగాణ నుంచి..

Precautionary Dose: తెలంగాణలో 25లక్షల మందికి వ్యాక్సిన్ మూడో డోస్

Vaccine

Precautionary Dose: ప్రధాని నరేంద్ర మోదీ 60ఏళ్లకు పైబడిన వ్యక్తుల్లో దేశవ్యాప్తంగా దాదాపు 3కోట్ల మందికి వ్యాక్సిన్ మూడో డోస్ వేయనున్నట్లు ప్రకటించారు. జనవరిలో చేపట్టనున్న ఈ ప్రక్రియలో తెలంగాణ నుంచి 25లక్షల మందికి మూడో డోస్ ప్రక్రియ చేపట్టనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 60ఏళ్లు పైబడ్డ వారిలో 65లక్షల మంది వరకూ మొదటి రెండు డోసులు వేసుకున్నారు. ఇప్పుడు వీరిలోనూ కొందరికి మాత్రమే మూడో డోసు వేస్తారన్నమాట.

వ్యాక్సిన్ రెండో డోసు వేసుకుని తొమ్మిది నెలలు గడిచిన వారికే మూడో డోస్ వేస్తారు. నిజానికి తెలంగాణలో మూడో డోసు వేసుకోవడానికి ఎక్కువ అర్హత కలిగిన వారు 18 నుంచి 44ఏళ్ల మధ్య వయస్కులే. వారి సంఖ్య సుమారు 2.73కోట్ల వరకూ ఉండొచ్చు. అది గాక 45నుంచి 60ఏళ్ల మధ్య వయస్కులు 1.17కోట్ల డోసులు వరకూ ఉంటుంది.

రెండు డోసులు ఏదైతే వ్యాక్సిన్ వేసుకున్నారో మూడో డోసు కూడా అదే వేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. మిక్స్ డ్ డోసుల గురించి క్లినికల్ ట్రయల్స్ పూర్తి అయ్యాకే తుది నిర్ణయం తీసుకుంటారు. ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొవీషీల్డ్ ను 3.97డోసులు పంపిణీ చేయగా, కొవాగ్జిన్ 54లక్షల డోసులు పంపిణీ చేసి సిద్ధంగా ఉంచారు.

rEAD aLSO : 2021 టాలీవుడ్ లో డెబ్యూ ఇచ్చిన భామలు

పీఎం మోదీ శనివారం మట్లాడుతూ.. 15 నుంచి 18 సంవత్సరాల మధ్య వయస్సున్న టీనేజర్లకు కొవిడ్ వ్యాక్సినేషన్ ఇవ్వాలని అన్నారు. జనవరి 3 నుంచి ప్రికాషన్ డోసెస్ పేరిట కార్యక్రామన్ని నిర్వహించాలని పిలుపునిచ్చారు. 60ఏళ్ల పైబడిన వారికి జనవరి 10 నుంచి ఇస్తారని చెప్తూ.. జనవరిలో థర్డ్ డోస్ చాలా తక్కువ మందికి మాత్రమే ఇస్తామని అన్నారు.

ఇప్పటి వరకూ కొవీషీల్డ్ వ్యాక్సిన్ 141 కోట్ల డోసులు వినియోగించారు. దీనిని బట్టే 60ఏళ్లు పైబడ్డ వారికి దాదాపు కోటి మంది వ్యాక్సిన్ మూడో డోసు వేసుకుంటారనే అంచనా. 15 నుంచి 18ఏళ్ల మధ్య వయస్కుల్లో ఇమ్యూనైజేషన్ పెంచడానికి కొవాగ్జిన్ బాగా సహకరిస్తుంది. 12ఏళ్లు పైబడ్డ వారిలో అత్యవసర వినియోగం కింద జైడస్ కాడిలాను వాడాలాని గవర్నమెంట్ నిర్దేశించింది.

rEAD aLSO: తొలి టెస్టులో ఆరంభం అదిరింది!