తెలంగాణలో కొత్తగా 253 కరోనా కేసులు, 8 మంది మృతి

  • Published By: bheemraj ,Published On : June 13, 2020 / 05:25 PM IST
తెలంగాణలో కొత్తగా 253 కరోనా కేసులు, 8 మంది మృతి

తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. ఇవాళ కొత్తగా 253 కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది మంది మృతి చెందారు. అత్యధికంగా జీహెచ్ ఎంసీ పరిధిలో 179 మందికి పాజిటివ్ వచ్చింది. సంగారెడ్డి 24, మేడ్చల్ 14, రంగారెడ్డి 11 కొత్త కేసులు నమోదు అయ్యాయి. తెలంగాణలో మొత్తం 4,737 కేసులు బయటపడ్డాయి. 182 మంది ప్రాణాలు కోల్పోారు. రాష్ట్రంలో 2, 203 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 2352 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 

తెలంగాణలో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పరుగుతోంది. ప్రభుత్వం, ప్రజల్లో ఆందోళన నెలకొంది. హైదరాబాద్ లో అత్యధింగా 253 ప్రజలకు కేసు నమోదు అయింది. రోజురోజుకూ సంఖ్యం పెరుగుతోంది. ఇవాళ 4737 పాజిటివ్ కేసుుల నమోదు అయ్యాయి. మొత్తం 36 జిల్లాలకు సంబంధించి 19 జిల్లాల్లో కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో ప్రభుత్వం కూడా అప్రమత్తం అవుతుంది. 

ఒక వైపు ఎమ్మెల్యే కుటుంబంతోపాటు జనగాం ఎమ్మె్ల్యే ముత్తిరెడ్డితోపాటు ఆయనతోపాటు ఆయన కుటుంబ సభ్యులకు అతని ఇంట్లో పని చేసే వంట మనిషి, గన్ మెన్లు, డ్రైవర్స్ కూడ పాజిటివ్ వచ్చింది. మరోవైపు జిహెచ్ఎంసీ మేయర్ కు సంబంధించిన సిబ్బందికి రావడంతో మేయర్ కు పరీక్షలు నిర్వహించారు.

 సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో ఒకే కుటుంబంలో 19 మందికి కరోనా సోకింది. జహీరాబాద్‌కు చెందిన 55 ఏళ్ల మహిళ ఈ నెల 9న హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆ రాత్రే ఆమె మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. మరుసటి రోజు సాయంత్రానికి మృతురాలికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.