CM KCR : దసరా కానుక ప్రకటించిన ప్రభుత్వం

సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం దసరా కానుక ప్రకటించింది. ఈ ఏడాది సంస్థ ఆర్జించిన లాభాల్లో 29శాతం వాటాను కార్మికులకు బోనస్ గా ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. గతేడాది కంట

CM KCR : దసరా కానుక ప్రకటించిన ప్రభుత్వం

Cm Kcr

CM KCR : సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం దసరా కానుక ప్రకటించింది. ఈ ఏడాది సంస్థ ఆర్జించిన లాభాల్లో 29శాతం వాటాను కార్మికులకు బోనస్ గా ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. గతేడాది కంటే ఒక శాతం పెంచుతూ సింగరేణి కార్మికులకు దసరా కానుక అందించారు కేసీఆర్. బోనస్ ను దసరాకు ముందే చెల్లించాలని సీఎండీ శ్రీధర్‌ను సీఎం ఆదేశించారు. మంగళవారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన సింగరేణిపై సమీక్ష నిర్వహించారు.

కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టబడి ఉందని కేసీఆర్‌ చెప్పారు. కార్మికుల భవిష్యత్‌ దృష్ట్యా సింగరేణి సంస్థ కార్యకలాపాలను విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. బొగ్గు తవ్వకంతో పాటు ఇసుక, ఇనుము, సున్నపు రాయి తదిత ఖనిజాల తవ్వకాల్లోకి సింగరేణి విస్తరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. బొగ్గుగని మైనింగ్, పవర్ జనరేషన్ నిర్వహణలో దేశంలోనే ఉన్నత స్థానంలో సింగరేణి సంస్థను నిలుపడంలో కార్మిక శ్రమ నైపుణ్యం ఎంతో గొప్పదన్నారు.

DarkWeb Hacker Forum: ఫేస్‌బుక్‌ యూజర్లకు మరో షాక్‌..!

నిరంతర శ్రమ చేస్తున్న కార్మికుల సంక్షేమం, భవిష్యత్‌కు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కార్మికుల నైపుణ్యాన్ని బొగ్గు తవ్వకంలోనే కాకుండా ఇసుక సున్నపురాయి, ఐరన్‌ తదితర ఖనిజాల తవ్వకాల్లో వినియోగించుకోవాల్సిన సందర్భం వచ్చిందన్నారు. ఇందుకు సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ‘ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీల వాళ్లు మన రిటైర్డ్‌ సింగరేణి కార్మికులను వినియోగించుకుని బొగ్గు తదితర ఖనిజాలను నిర్వహిస్తూ.. లాభాలు గడిస్తున్నారు.

Internet: ఇంటర్నెట్ ‘స్లో’గా ఉందా? చిటికెలో వైఫై స్పీడ్ పెంచుకోండి!

మనమే ఎందుకు ఆ పని చేయకూడదు? లాభాలు వచ్చే అవకాశమున్న ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం ప్రయివేట్ పరం చేస్తుండడం శోచనీయం. తెలంగాణ ప్రభుత్వం సింగరేణి కార్మికుల సంక్షేమాన్ని, సంస్థ మనుగడను దృష్టిలో ఉంచుకుని పనిచేస్తుంది. వారి నైపుణ్యాన్ని, శక్తిని తెలంగాణ ప్రభుత్వం తప్పకుండా వినియోగించుకుంటుంది. బొగ్గుతోపాటు రాష్ట్రంలో నిల్వలున్న ఇతర మైనింగ్ రంగాలను నిర్వహిస్తూ కార్మికులకు పని కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా చర్యలు చేపడుతుంది’ అని సీఎం స్పష్టం చేశారు.