Corona : 29 మంది విద్యార్థినిలకు కరోనా.. అప్రమత్తమైన అధికారులు

ఖమ్మం జిల్లా వైరాలోని గురుకుల బాలికల పాఠశాలలో 29 మంది విద్యార్థినిలు కరోనా బారినపడ్డారు. జలుబు, జ్వరంతో బాధపడుతున్న వారికి పరీక్షలు చేయగా కరోనా నిర్దారణ అయింది.

Corona : 29 మంది విద్యార్థినిలకు కరోనా.. అప్రమత్తమైన అధికారులు

Corona (2)

Corona : ఖమ్మం జిల్లా వైరాలోని గురుకుల బాలికల పాఠశాలలో 29 మంది విద్యార్థినిలు కరోనా బారినపడ్డారు. కొందరు జలుబు, జ్వరంతో బాధపడుతుండటంతో ఆదివారం ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించారు. పాఠశాలలోని 440 మంది విద్యార్థినిలకు పరీక్షలు నిర్వహించగా 29 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. పాఠశాలలో మొత్తం 620 మంది విద్యార్థినిలు ఉండగా.. 440 మందికి పరీక్షలు నిర్వహించారు.

చదవండి : Khammam : బిల్డర్లు, మేస్త్రీలకు జీఎస్టీ అధికారుల వేధింపులు..10టీవీ చేతిలో కీలక ఆధారాలు

మిగిలిన వారికి సోమవారం పరీక్షలు నిర్వహించేందుకు వైద్య బృందం సిద్ధమైంది.. అయితే అప్పటికే తల్లిదండ్రులు పిల్లలను తీసుకోని వెళ్లిపోవడంతో మిగతావారికి పరీక్షలు చేయలేకపోయారు. ఇదే విషయంపై మీడియా స్కూల్ ప్రిన్సిపాల్‌ లక్ష్మిని ప్రశ్నించగా.. ఉన్నతాధికారుల సూచన మేరకు పిల్లలను ఇళ్ళకి పంపినట్లు తెలిపారు.

చదవండి : Corona : బాలికల గురుకుల పాఠశాలలో 28 మంది విద్యార్థినులకు కరోనా

జిల్లా కొవిడ్‌ నిర్ధారణ అధికారి డాక్టర్‌ రాజేశ్‌, వైరా పీహెచ్‌సీ డాక్టర్‌ సుచరిత పర్యవేక్షణలో ఈ పరీక్షలు చేశారు. విద్యార్థినిలకు కరోనా సోకిన విషయం తెలియడంతో వైరా మున్సిపాలిటీ సిబ్బంది శానిటేషన్‌, పారిశుధ్య పనులను చేపట్టారు.