Sangareddy : కడుపులో వెంట్రుకల తుట్టె…ఎన్ని కిలోలో తెలుసా ?

కడుపులో వెంట్రుకల తుట్టెను విజయవంతంగా తొలగించారు వైద్యులు. ఒకటి కాదు..రెండు కాదు..మూడు కిలోల వెంట్రుకలను బయటకు తీశారు.

10TV Telugu News

3 KG Hair Ball : కడుపులో వెంట్రుకల తుట్టెను విజయవంతంగా తొలగించారు వైద్యులు. ఒకటి కాదు..రెండు కాదు..మూడు కిలోల వెంట్రుకలను బయటకు తీశారు. నిర్విరామంగా…రెండు గంటల పాటు ఈ ఆపరేషన్ నిర్వహించారు వైద్యులు. ఎలాంటి ప్రమాదం రాకుండా..ఆపరేషన్ చేసిన వైద్యులకు ఆమె కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలియచేస్తున్నారు. ఆమెకు మూడు నెలల క్రితం వివాహం జరిగింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా ఆసుపత్రిలో చోటు చేసుకుంది.

Read More : Vijayawada : దసరా వచ్చేస్తోంది..ఇంద్రకీలాద్రికి వెళుతున్నారా, తెలుసుకోవాల్సిన విషయాలు!

వికారాబాద్ జిల్లా బూచన్ పల్లి గ్రామానికి చెందిన అంతారం శ్రీలతకు మూడు నెలల క్రితమే వివాహం జరిగింది. గత కొద్ది రోజుల నుంచి ఈమె తీవ్ర కడుపునొప్పితో బాధ పడుతుండేది. స్థానికంగా ఉన్న ఆసుపత్రుల్లో చికిత్స చేయించినా..ఫలితం కనబడడం లేదు. అంతకంతకు కడుపు నొప్పి అధికం అవుతూ వస్తోంది. దీంతో ఈ నెల 17వ తేదీన సంగారెడ్డి జిల్లా ఆసుపత్రికి వచ్చి అక్కడి వైద్యులకు చూపించారు.

Read More : Sneha Dubey : ఎవరీ స్నేహ దుబే..UN వేదికపై పాకిస్థాన్ తీరును చీల్చి చెండాడి..ప్రధాని ఇమ్రాన్ ను ఏకి పారేసిన ధీర..!!

దీంతో శ్రీలతకు సిటీ స్కాన్ చేశారు. కడుపులో వెంట్రుకల తుట్టె ఉన్నట్లు గుర్తించారు. జనరల్ సర్జన్ డా.కిరణ్ కుమార్..నేతృత్వంలోని వైద్యుల బృందం..శుక్రవారం ఆపరేషన్ చేశారు. దాదాపు రెండు గంటల పాటు ఈ చికిత్స జరిగింది. చివరకు ఆమె కడుపులో ఉన్న మూడు కిలోల వెంట్రుకల తుట్టెను తొలగించారు.

10TV Telugu News