Telangana Corona : తెలంగాణలో కొత్తగా 4,393 కరోనా కేసులు, ఇద్దరు మృతి

తెలంగాణలో ఇప్పటివరకు వైరస్ సోకి 4,071 మంది చనిపోయారు. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 1,643 కరోనా కేసులు నమోదు అయ్యాయి.

Telangana Corona : తెలంగాణలో కొత్తగా 4,393 కరోనా కేసులు, ఇద్దరు మృతి

Ts Corona

new corona cases in Telangana : తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. రాష్ట్రంలో భారీగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. రోజు వారీగా నాలుగు వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇవాళ కొత్తగా 4,393 కరోనా కేసులు రిజిస్టర్ అయ్యాయి. గత 24 గంటల్లో కరోనా బారిన పడి ఇద్దరు మృతి చెందారు. రాష్ట్రంలో ప్రస్తుతం 31,199 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

తెలంగాణలో ఇప్పటివరకు వైరస్ సోకి 4,071 మంది చనిపోయారు. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 1,643 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో కొత్తగా 11,486 కరోనా కేసులు, 45 మంది మృతి చెందారు. ఢిల్లీలో ప్రస్తుతం 58,593 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.

IPS Officers Promotion : తెలంగాణలో 12 మంది ఐపీఎస్ అధికారులకు పదోన్నతి

మరోవైపు తెలంగాణలో కరోనా వ్యాప్తి నియంత్రణకు చేపట్టిన జ్వర సర్వే రెండో రోజు కొనసాగింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 45 వేల 567 మందిలో కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు వైద్య సిబ్బంది. జలుబు, దగ్గు, జ్వరం, గొంతు నొప్పితో బాధపడుతున్నవారు వీరంతా. లక్షణాలున్న ప్రతి ఒక్కరికి హోమ్‌ ఐసొలేషన్ కిట్స్‌ను అందచేశారు.

కరోనా సెకండ్ వేవ్‌లో రెండు, మూడు దఫాలుగా ఫీవర్ సర్వే నిర్వహించింది వైద్య ఆరోగ్య శాఖ. ధర్డ్‌ వేవ్‌లో కేసులు ఎక్కువగా వస్తుండడంతో మళ్లీ రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి ఫీవర్‌ సర్వే చేపట్టారు అధికారులు. పల్లెలు, పట్టణాల్లో చేపట్టిన ఇంటింటా జ్వర సర్వేకు..ఒక్కో బృందంలో కనీసం ముగ్గురు సభ్యులు ఉన్నారు. ఒక్కో బృందం రోజుకు కనీసం 25 ఇళ్లలో సర్వే చేస్తోంది. ఇప్పటివరకు వ్యాక్సిన్‌ తీసుకోనివారిని అక్కడికక్కడే వ్యాక్సిన్‌ చేస్తున్నారు.

Minister Vellampalli : హిందువులపై బీజేపీది కపట ప్రేమ : మంత్రి వెల్లంపల్లి

ఫీవర్‌ సర్వేలో చిన్నారులు, పెద్దల నుంచి విడివిడిగా వివరాలు సేకరిస్తున్నారు. ఎక్కువగా పెద్దవారిలోనే లక్షణాలు గుర్తించారు. కోవిడ్‌ లక్షణాలు ఉండి తీవ్రంగా ఇబ్బందిపడుతున్నవారికి టెస్ట్‌ చేస్తున్నారు. 5 రోజుల పాటు వారి ఆరోగ్యం ఎలా ఉందో తరచూ పరిశీలిస్తుంటారు. ఆరోగ్యం క్షీణిస్తుంటే…ఆసుపత్రుల్లో చేరుస్తారు. తెలంగాణలో మరో ఆరు రోజుల పాటు జ్వర సర్వే కొనసాగనుంది. ఇంటింటికి వెళ్లి లక్షణాలు తెలుసుకుంటుడడంతో…టెస్టింగ్‌ సెంటర్స్‌కు కాస్త రద్దీ తగ్గుతోంది.