CP Sajjanar : 45వేల కేసులు, 4వేల వాహనాలు సీజ్.. హైదరాబాద్‌లో కఠినంగా లాక్‌డౌన్

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో లాక్ డౌన్ పకడ్బందీగా అమలవుతోంది. లాక్ డౌన్ సమయంలో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేశారు. అంతేకాదు వాహనాలూ సీజ్ చేశారు. లాక్ డౌన్ నిబంధనలు బ్రేక్ చేసినందుకు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో

CP Sajjanar : 45వేల కేసులు, 4వేల వాహనాలు సీజ్.. హైదరాబాద్‌లో కఠినంగా లాక్‌డౌన్

Cp Sajjanar

CP Sajjanar : సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో లాక్ డౌన్ పకడ్బందీగా అమలవుతోంది. లాక్ డౌన్ సమయంలో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేశారు. అంతేకాదు వాహనాలూ సీజ్ చేశారు. లాక్ డౌన్ నిబంధనలు బ్రేక్ చేసినందుకు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటివరకు 45వేల కేసులు నమోదవగా, 4వేలకు పైగా వాహనాలను సీజ్ చేసినట్టు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. కొన్నిచోట్ల పోలీసులతో వాగ్వాదానికి దిగిన వారున్నారని అలాంటి వారిని కఠినంగా శిక్షిస్తామని అన్నారు. లాక్ డౌన్ సమయంలో ప్రజలు బయటకు వస్తే ఊరుకునేది లేదన్నారు.

”సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 75 చెక్ పోస్టులు, బారికేడ్లు ఏర్పాటు చేశాం. 25 స్పెషల్ టీమ్స్ ఉన్నాయి. 150 పెట్రోల్ వెహికల్స్ తిరుగుతున్నాయి. 25 స్పెషల్ టీమ్స్ పని చేస్తున్నాయి. ఇప్పటివరకు దాదాపుగా 45వేల కేసులు నమోదు చేశాం. 4వేల వెహికల్స్ సీజ్ చేశాం. చాలామంది అకారణంగా రోడ్లపైకి వస్తున్నారు. వ్యాక్సినేషన్ వేయించుకోవడానికి ఎక్కువమంది వస్తున్నారు. వాళ్ల దగ్గరున్న మేసేజ్ లేదా స్లిప్ చూసి పర్మిషన్ ఇస్తున్నాం. వ్యాక్సినేషన్ కారణంగా పబ్లిక్ ఎక్కువగా బయటకు వస్తున్నారు. రద్దీ ప్రాంతాల్లో స్పెషల్ టీమ్స్ పెట్టాము. కూకట్ పల్లి, కేపీహెచ్బీ, మియాపూర్, చందానగర్, సనత్ నగర్ ఎక్కువ డెన్సిటీ ఉన్న ప్రాంతాలు.

అక్కడ మేము స్పెషల్ టీమ్స్ పెట్టాము. హైదరాబాద్ లో ఎక్కడా హాట్ స్పాట్స్ లేవు. ఈ క్రమంలో ఆంక్షలు సడలిస్తే మళ్లీ పాజిటివ్ కేసులు పెరిగే ప్రమాదం ఉంది. ప్రజలు అర్థం చేసుకోవాలి. చాలామంది మాకు సహకరిస్తున్నారు. 99శాతం మంది పబ్లిక్ పోలీసులకు కో-ఆపరేట్ చేస్తున్నారు. అక్కడక్కడ కొందరు పబ్లిక్ సాహసం చేస్తున్నారు. పోలీసులు ఏమైనా రిలాక్స్ అయ్యారా? మనం బయట తిరగొచ్చా? అలాంటి సాహసాలు, ప్రయోగాలు చేయొద్దు. లేదంటే చట్టం తన పని చేయాల్సి వస్తుంది” సీపీ సజ్జనార్.

కరోనా కట్టడి కోసం విధించిన లాక్ డౌన్ ను తెలంగాణ ప్రభుత్వం పొడిగించిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ విధించడం వల్ల కరోనా కేసులు కొంత మేర తగ్గాయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. కాగా, పోలీసులు లాక్ డౌన్ అమలు విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. పక్కాగా లాక్ డౌన్ అమలయ్యేలా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో నగర ప్రజలకు సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాల్సిందే అని తేల్చి చెప్పారు.

లాక్ డౌన్ సమయంలో ఏ ఒక్కరూ అనవసరంగా రోడ్లపైకి రాకూడదన్నారు. నిబంధనలను ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చే వాహనాలను సీజ్ చేస్తామన్నారు. భూముల రిజిస్ట్రేషన్లకు వెళ్లే వారు స్లాట్ బుక్ చేసుకోవాలని… పోలీసులకు చూపించాలని తెలిపారు.