తెలంగాణలో 487కు చేరిన కేసులు…12 మంది మృతి

తెలంగాణలో కరోనా కేసులు గత రెండు రోజులుగా తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. ఇవాళ కొత్తగా 16 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తంగా కరోనా కేసుల సంఖ్య 487కి చేరింది.

  • Published By: veegamteam ,Published On : April 10, 2020 / 05:38 PM IST
తెలంగాణలో 487కు చేరిన కేసులు…12 మంది మృతి

తెలంగాణలో కరోనా కేసులు గత రెండు రోజులుగా తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. ఇవాళ కొత్తగా 16 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తంగా కరోనా కేసుల సంఖ్య 487కి చేరింది.

తెలంగాణలో కరోనా కేసులు గత రెండు రోజులుగా తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. ఇవాళ కొత్తగా 16 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తంగా కరోనా కేసుల సంఖ్య 487కి చేరింది. ఇందులో 430 యాక్టివ్‌ కేసులు కాగా 45 మంది వైరస్‌ మహమ్మారి నుంచి తప్పించుకుని ఇంటికి చేరారు. ఇక కరోనాతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 12 మంది ప్రాణాలు కొల్పోయారు.

ఇక హైదరాబాద్‌లో అత్యధికంగా 179 కేసులు నమోదు కాగా, నిజామాబాద్‌లో 49 పాజిటివ్‌ కేసులు, ఆ తర్వాత రంగారెడ్డి జిల్లాలో 27 కేసులు, వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో 23 కేసులు, మెడ్చల్‌ జిల్లాలో 21 కేసులు నమోదయ్యాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 16 జిల్లాలో పదిలోపు కేసులు నమోదయ్యాయి. 

కరోనా వైరస్‌ను పూర్తిస్థాయిలో కట్టడిచేయడానికి ప్రభుత్వం మరింత కట్టుదిట్టంగా చర్యలు చేపట్టింది. వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం ఆరు ల్యాబ్‌లు 24 గంటలు పనిచేస్తున్నాయి. ఎన్ని పాజిటివ్‌ కేసులు నమోదైనా చికిత్స అందించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. అలాగే వైద్యసిబ్బందికి అవసరమైన ఎన్‌-95 మాస్కులు, సర్జికల్‌ మాస్కులు, హ్యాండ్‌ గ్లౌజ్‌లు,  పీపీఈ కిట్లను సిద్ధం చేస్తోంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను కూడా పోలీసులు మరింత కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు.