మెట్రోసిటీలు అన్నీ రెడ్ జోన్లే..: కేంద్ర ప్రభుత్వం

  • Published By: Subhan ,Published On : May 1, 2020 / 03:00 AM IST
మెట్రోసిటీలు అన్నీ రెడ్ జోన్లే..: కేంద్ర ప్రభుత్వం

కేంద్ర ఆరోగ్య శఆఖ ప్రధాన మెట్రోస్టేషన్నింటినీ రెడ్ జోన్లేనంటూ సూచించింది. మే3తో పూర్తవుతున్న లాక్‌డౌన్ తర్వాత ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్, బెంగళూరు, అహ్మదాబాద్‌లను రెడ్ జోన్లకు మాదిరి ట్రీట్ చేయాలని స్థానిక ప్రభుత్వాలకు సూచించింది. కదలికలపై ఫోకస్ ఉంచాలని కఠినంగా చర్యలను అమలు చేయాలని ఆదేశించింది. 

అన్ని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్య కార్యదర్శులకు కేంద్ర ఆరోగ్య శాఖ సెక్రటరీ ప్రీతి సూడాన్ ఓ లేఖ రాశారు. అందులో 130 ప్రాంతాలను రెడ్ జోన్లుగా, 284 ఆరంజ్ జోన్లు, 319గ్రీన్ జోన్లుగా పేర్కొన్నారు. ‘కంటైన్మెంట్ ప్రాంతాలు మరింత ఎఫెక్టివ్ గా కనిపించడానికి.. ఇదొక హెచ్చరిక. కంటైన్మెంట్ జోన్ చుట్టూ బఫర్ జోన్ ను ఏర్పాటు చేస్తున్నామని అందులో రాశారు. (అందరి చూపు మే 03 : ఇటలీ తరహాలో లాక్ డౌన్ ఎత్తివేత!)

ఉత్తరప్రదేశ్(19), మహారాష్ట్ర(14)ల్లో అత్యధికంగా రెడ్ జోన్లు ఉన్నాయి.  తమిళనాడు(12), ఢిల్లీ(11)జిల్లాల్లో రెడ్ జోన్లుగా ప్రకటించారు. ఢిల్లీలోని సబ్ అర్బన్ ప్రాంతాలైన ఫరీదాబాద్, గౌతమ్ బుద్ధ నగర్, మీరట్ లు రెడో జోన్లు. గుర్గావ్, ఘాజియాబాద్ లు ఆరంజ్ జోన్లు, ముంబైలోని సబర్బన్ జోన్లన్నీ రెడ్ జోన్లే. 

బెంగళూరులో అర్బన్, రూరల్ ప్రాంతాలు, మైసూర్ తో సహా రెడ్ జోన్లే. రెసిడెన్షియల్ కాలనీ, మొహల్లాలు, మునిసిపల్ వార్డులు, పోలీస్ స్టేషన్ ప్రాంతాలు, మునిసిపల్ జోన్లు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలు, పంచాయతీలు అన్నింటినీ ఆ లేఖలో పేర్కొన్నారు. (ఇండియాలో కరోనా..మృతులు 1, 075 : మహారాష్ట్ర విలవిల..ఒక్కరోజే 583 కేసులు)

ఈ రెడ్ జోన్లుగా ప్రకటించిన జిల్లాల్లో తప్పనిసరి అయితేనే ఎంట్రీ, ఎగ్జిట్ లు కుదిరేది. మెడికల్ ఎమర్జెన్సీ, నిత్యవసర వస్తువుల్లాంటి సర్వీసులకు మాత్రమే అనుమతి ఉంది. ఇంటింటికీ చెక్ చేసి హెల్త్ రిపోర్టుపై ఆరా తీస్తారు. అన్ని కేసులకు టెస్టులు నిర్వహిస్తారు. సామాజిక దూరాన్ని తప్పకుండా అమలు చేస్తారు.

బఫర్ జోన్లలో ప్రత్యేక నిఘా నిర్వహించి ఫ్లూ, శ్వాస సంబంధిత సమస్యలు ఉంటే వాటిపైన శ్రద్ధ పెడతాం. గత 21రోజులుగా ఒక్క కేసు కూడా నమోదుకాని ప్రాంతాల జోన్ లెవల్ ను ఒక స్థాయికి తగ్గిస్తాం. జోన్ల స్థాయిని వారానికి ఒకసారి రివైజ్ చేసి ప్రకటిస్తాం. హోం అఫైర్స్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్, 2005 కింద దీనిని అమలుపరుస్తారని ఆ లెటర్లో రాసుకొచ్చారు.