ఒకే పోలీస్ స్టేషన్‌లో తొమ్మిది మంది పోలీసులకు కరోనా వైరస్

  • Published By: vamsi ,Published On : May 1, 2020 / 04:50 AM IST
ఒకే పోలీస్ స్టేషన్‌లో తొమ్మిది మంది పోలీసులకు కరోనా వైరస్

కరోనా దెబ్బకు దేశం విలవిలలాడిపోతుంది. రోజురోజుకు కేసులు విపరీతంగా పెరిగిపోతుండగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో సేవలు అందిస్తున్న పోలీసులు.. వైద్యులు కూడా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. లేటెస్ట్‌గా ముంబైలోని వడాలాలోని ఒకే పోలీస్ స్టేషన్‌లో తొమ్మిది మంది పోలీసు సిబ్బందికి ఒకే రోజు కోవిడ్ -19 పాజిటివ్ అని తేలింది.(లాక్ డౌన్ 2.0 ఎత్తివేస్తే..ప్రజలు..ప్రభుత్వాలు ఏం చేయాలి ? )

కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుళ్ల ర్యాంకుకు చెందిన తొమ్మిది మంది పోలీసులు నిన్న పరీక్షలు చేయించుకోగా.. అదే రోజు సాయంత్రం వచ్చిన ఫలితాల్లో తొమ్మిది మంది కోవిడ్ -19 పాజిటివ్  అని తేలారు. వీరందరినీ గురు నానక్ హాస్పిటల్, బాంద్రా, పరేల్‌లోని కెఈఎమ్ హాస్పిటల్, దక్షిణ ముంబైలోని బాంబే హాస్పిటల్‌లో చేర్పించారు.

వారిలో కొందరి వయస్సు 50+ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వారి కాంటాక్ట్‌లను గుర్తించి నిర్బంధంలో ఉంచినట్లు అధికారులు వెల్లడించారు. కొర్బా మిత్ అగర్, బంగలిపుర మురికివాడలు, చాల్స్ సహా ఏడు రెడ్ జోన్‌లోని మండలాలు వడాలా పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తాయి. డ్యూటీ చేస్తున్న సమయంలోనే పోలీసులకు ఈ వ్యాధి సోకినట్లు అనుమానిస్తున్నారు. ముంబైలో ఇప్పటివరకు 106 మంది పోలీసులకు వైరస్ సోకగా అందులో ముగ్గురు మరణించినట్లు అధికారులు చెబుతున్నారు.