సామాన్యుడికి రూ.6.67 లక్షల కరెంట్ బిల్లు

  • Published By: bheemraj ,Published On : July 28, 2020 / 08:52 PM IST
సామాన్యుడికి రూ.6.67 లక్షల కరెంట్ బిల్లు

ఓ సామాన్యుడికి కరెంట్ బిల్లు షాక్ ఇచ్చింది. నాలుగు నెలలకు గానూ వందలు కాదు, వేలు కాదు ఏకంగా 6 లక్షల 67 వేల కరెంట్ బిల్లు వచ్చింది. హైదరాబాద్ అంబర్ పేటలోని పటేల్ నగర్ లో ఉంటున్న వీరబాబు ఆ బిల్లును చూసి ఖంగుతిన్నాడు.


అంత బిల్లు ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలంటూ లబోదిబోమన్నాడు. తన ఇంటిని అమ్మేసి కరెంట్ బిల్లు చెల్లించి మిగిలిన డబ్బులు ఇవ్వాలని అధికారులను కోరాడు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. వందల్లో వచ్చే కరెంట్ బిల్లు వేలల్లో వచ్చిన సందర్భాలు ఉన్నాయి.

కరెంట్ బిల్లులు అధిక మొత్తంలో రావడంతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. కరెంట్ బిల్లులు వేలల్లో, లక్షల్లో రావడంతో సామాన్యులు ఆశ్చర్యపోతున్నారు. ఇంత పెద్ద మొత్తంలో రావడంతో ఎక్కడి తెచ్చి కట్టాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.